Share News

Actor Vijay: నేను టైమ్‌పాస్‌ కోసం రాజకీయాల్లోకి రాలేదు..

ABN , Publish Date - Oct 05 , 2024 | 12:26 PM

పేరు ప్రఖ్యాతుల కోసమో, కాలయాపన కోసమో తాను రాజకీయప్రవేశం చేయలేదని ప్రజలతో మమేకమై వారికి సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తమిళగ వెట్రికళగం (టీవీకే) నేత, నటుడు విజయ్‌(Actor Vijay) పేర్కొన్నారు.

Actor Vijay: నేను టైమ్‌పాస్‌ కోసం రాజకీయాల్లోకి రాలేదు..

- మహానాడుతో మా సత్తా చాటుతాం

- టీవీకే నేత విజయ్‌ ప్రకటన

చెన్నై: పేరు ప్రఖ్యాతుల కోసమో, కాలయాపన కోసమో తాను రాజకీయప్రవేశం చేయలేదని ప్రజలతో మమేకమై వారికి సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తమిళగ వెట్రికళగం (టీవీకే) నేత, నటుడు విజయ్‌(Actor Vijay) పేర్కొన్నారు. విల్లుపురం జిల్లా విక్రవాండిలో ఈ నెల 27న జరుగనున్న తొలిమహానాడు సందర్భంగా అక్కడ శుక్రవారం మూహూర్త స్తంభ స్థాపన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా విజయ్‌ పార్టీ శ్రేణులకు ఓ లేఖ రాశారు. పార్టీ శ్రేణులంతా పార్టీ తొలిమహానాడు ఎప్పుడు జరుగుతుందా అని నెలల తరబడి వేచి చూశారని, వారిని తాను, తనను వారు కలుసుకునే సమయం ఆసన్నమైందని తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Rahul Gandhi: పరువు నష్టం దావాలో రాహుల్‌కు సమన్లు


పార్టీ శ్రేణులతో తన అనుబంధం కుటుంబ బంధం వంటిదని, తొలిసారిగా కార్యకర్తలకు లేఖ రాస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రజలకోసం తీవ్రంగా పాటుపడాలని, వారి సమస్యలు దశాబ్దాలతరబడి అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. శుక్రవారం పార్టీ మహానాడు ముహూర్తస్తంభ స్థాపన కార్యక్రమం విజయవంతంగా ముగిసిందన్నారు. పార్టీ లక్ష్యాలను వెల్లడించేందుకే ఈ మహానాడును నిర్వహిస్తున్నామని తెలిపారు.


nani1.2.jpg

రాజకీయాలు తెలుసునా అంటూ ప్రశ్నించిన వారందరూ ఈ మహానాడు తర్వాత ఆశ్చర్యపోవటం ఖాయమన్నారు. కార్యకర్తలంతా బాధ్యత కలిగిన పౌరులుగా, ఆదర్శపురుషులుగా ఉన్నవారినే ప్రజలు ఆదరిస్తారని, కార్యకర్తలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మహానాడు ఏర్పాట్లు ప్రారంభమై, మహానాడు జరిగేంతవరకూ పార్టీ శ్రేణులు సైనికుల్లా ప్రవర్తించాలని, ఇతర పార్టీల కంటే తమిళగ వెట్రి కళగం భిన్నమైనదని నిరూపించాలన్నారు.


అట్టహాసంగా స్తంభస్థాపన...

టీవీకే తొలి మహానాడు జరుగనున్న విక్రవాండి వి.సాలై వద్ద శుక్రవారం వేకువజాము ముహూర్తస్తంభ స్థాపన పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. బుస్సీ ఆనంద్‌తోపాటు పార్టీ జిల్లా కార్యదర్శి భరణి బాలాజీ, ఖుషీ మోహన్‌, వడివేల్‌, న్యాయవాది అరవింద్‌, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు మోహన్‌, విక్రవాండి స్థానిక నాయకుడు శేఖర్‌, కార్యదర్శి కామరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో..

ఇదికూడా చదవండి: KBR Park: 7 వంతెనలు.. 7 సొరంగ మార్గాలు

ఇదికూడా చదవండి: Harish Rao,: దసరా తర్వాత ఢిల్లీలో ధర్నా

ఇదికూడా చదవండి: నా కుమారుల ఫామ్‌హౌస్ లు ఎక్కడున్నాయో చూపించాలి?

Read Latest Telangana News and National News

Updated Date - Oct 05 , 2024 | 12:26 PM