Actress Radhika: నటి రాధిక ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే...
ABN , Publish Date - Oct 30 , 2024 | 12:28 PM
నటుడు విజయ్(Actor Vijay) రాజకీయాల్లోకి రావడం ఆశ్చర్యంగా ఉందని నటి రాధిక(Radhika) అభిప్రాయపడ్డారు. కోవై మక్కల్ సేవా కేంద్రం ఆధ్వర్యంలో కోవైలోని గుజరాత్ సమాజంలో సోమవారం దీపావళి బహుమతుల పంపిణీ కార్యక్రమం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో నటి రాధిక పాల్గొని 150 మంది బాలికలకు దీపావళి కానుకలు అందజేశారు.
- విజయ్ రాజకీయాల్లోకి రావడమా !?
- నటి రాధిక
చెన్నై: నటుడు విజయ్(Actor Vijay) రాజకీయాల్లోకి రావడం ఆశ్చర్యంగా ఉందని నటి రాధిక(Radhika) అభిప్రాయపడ్డారు. కోవై మక్కల్ సేవా కేంద్రం ఆధ్వర్యంలో కోవైలోని గుజరాత్ సమాజంలో సోమవారం దీపావళి బహుమతుల పంపిణీ కార్యక్రమం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో నటి రాధిక పాల్గొని 150 మంది బాలికలకు దీపావళి కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ... టీవీకే అధ్యక్షుడు విజయ్‌కు నా శుభాకాంక్షలు. సినీ రంగంలో స్టార్‌గా ఉన్న విజయ్ దానిని వదిలి రాజకీయాల్లో రావడం ఆశ్యర్యానికి గురిచేసింది. సమత్తువ మక్కల్ కట్చి పార్టీ జెండాలోని రంగులనే విజయ్ తన పార్టీ జెండాలో వాడడం మంచి విషయం. విజయ్ తన సినిమాల్లోలాగే మహానాడు కూడా ‘వన్ మ్యాన్ షో’గా చూపించాడని రాధిక వ్యాఖ్యానించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hero Vijay: త్వరలో హీరో విజయ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన
..........................................................................
ఈ వార్తను కూడా చదవండి:
..........................................................................
Union Minister: హీరో విజయ్‌కు సిద్ధాంతాలపై స్పష్టత లేదు
- కేంద్రమంత్రి మురుగన్
చెన్నై: తమిళగ వెట్రికళగం నాయకుడు, సినీ నటుడు విజయ్(Movie actor Vijay) పార్టీ తొలి మహానాడు అట్టహాసంగా నిర్వహించినప్పటికీ పార్టీ సిద్ధాంతాలను ప్రకటించడంలో పూర్తిగా విఫలమయ్యారని కేంద్ర మంత్రి ఎల్.మురుగన్(Union Minister L. Murugan) విమర్శించారు. స్థానిక ఐసీఎప్ అంబేడ్కర్ అరంగంలో మంగళవారం జరిగిన సభలో చెన్నై పోస్టల్ శాఖలో 91 మందికి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 13 మందికి, రైల్వేశాఖలో ఏడుగురికి, ఆర్థికశాఖ 36 మందికి, కేంద్ర భద్రతాదళంలో ఇద్దరికి చొప్పున ఆయన ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.
ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయ్ తన పార్టీతో పొత్తులు పెట్టుకుంటే అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు తెరలేపారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదకొండేళ్లుగా సంకీర్ణ ప్రభుత్వాన్నే నడుపుతోందన్నారు. ద్రావిడ సిద్ధాంతాలను ఆదర్శంగా చేసుకుంటామని చెప్పి విజయ్ సిద్ధాంతపరంగా వెనుకంజ వేసినట్లు తెలుస్తోందని, అదే సమయంలో బీజేపీని ఏదో విమర్శించాలన్న ఒత్తిడితో విమర్శలు చేశారే తప్ప ఘాటైన విమర్శలు చేయలేదనిమంత్రి మురుగన్ తెలిపారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి చిత్తుగా ఓడిపోవటం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మట్టి రోడ్డు లేకుండా చేస్తాం
ఈవార్తను కూడా చదవండి: యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు 7,037 కోట్ల అదనపు రుణం
ఈవార్తను కూడా చదవండి: KTR : కాంగ్రెస్ దాడులను ఎదుర్కొందాం
ఈవార్తను కూడా చదవండి: టీజీఎస్పీ పోలీసుల వైఖరిపై నిఘా
Read Latest Telangana News and National News