PM Modi: కాంగ్రెస్‌పై మోదీ నిప్పులు.. ఎందుకంటే..?
ABN , Publish Date - Apr 12 , 2024 | 09:51 PM
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తోందని, దేశాన్ని హిందు రాజ్యంగా మారుస్తోందని కాంగ్రెస్ పార్టీ పదే పదే విమర్శలు చేస్తోంది. ఆ కామెంట్లపై ప్రధాని మోదీ స్పందించారు. రాజస్థాన్ బర్మర్‌లో శుక్రవారం నాడు ప్రచారంలో పాల్గొన్నారు. ‘బీజేపీ, తమ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తోంది. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ తిరిగి వచ్చిన సరే రాజ్యాంగాన్ని మార్చలేదు.
బర్మర్: బీజేపీ (BJP) మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తోందని, దేశాన్ని హిందు రాజ్యంగా మారుస్తోందని కాంగ్రెస్ పార్టీ పదే పదే విమర్శలు చేస్తోంది. ఆ కామెంట్లపై ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. రాజస్థాన్ బర్మర్‌లో శుక్రవారం నాడు ప్రచారంలో పాల్గొన్నారు. ‘బీజేపీ, తమ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తోంది. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ తిరిగి వచ్చిన సరే రాజ్యాంగాన్ని మార్చలేదు. ఈ దేశ రాజ్యాంగం బీజేపీకి అన్ని ఇచ్చింది అని’ ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానానికి గురిచేసింది. ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులను హరించింది. ఇప్పుడు అదే రాజ్యాంగం పేరు చెప్పి తనను దూషిస్తోందని మోదీ వివరించారు. అంబేద్కర్‌కు కాంగ్రెస్ పార్టీ భారత రత్న ఇవ్వలేదని మండిపడ్డారు. అంబేద్కర్ బతికి ఉన్న సమయంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓడించిందని గుర్తుచేశారు. ఈ రోజు రాజ్యాంగం పేరు చెప్పి బీజేపీపై విమర్శలు చేస్తుందని వివరించారు.
BJP: కుల గణనకు బీజేపీ వ్యతిరేకమా.. జేపీ నడ్డా ఏమన్నారంటే
మరిన్ని జాతీయ వార్తల కోసం