Share News

Bangalore: రేపు బళ్లారిలో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీలు

ABN , Publish Date - Jan 06 , 2024 | 11:15 AM

‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు... పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యాసంస్థలు, బెంగళూరు... రియల్‌ పార్టనర్‌ స్వర్గసీమ సుకేతన’ సౌజన్యంతో బళ్లారిలో శ్రీచైతన్య సహకారంతో

Bangalore: రేపు బళ్లారిలో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీలు

బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు... పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యాసంస్థలు, బెంగళూరు... రియల్‌ పార్టనర్‌ స్వర్గసీమ సుకేతన’ సౌజన్యంతో బళ్లారిలో శ్రీచైతన్య సహకారంతో ఆదివారం (రేపు) నగరంలోని హవంబావి వద్ద ఉన్న శ్రీచైతన్య బాలికల పీయు కళాశాల ఆవరణంలో ముత్యాల ముగ్గుల పోటీలు జరగనున్నాయి. ముగ్గులు వేయాలనే ఆసక్తి ఉన్న మహిళలు పాల్గొనాలని నిర్వాహకులు తెలిపారు. ముత్యాల ముగ్గుల పోటీల్లో విజేతలకు మొదటి బహుమతి రూ. 6,000, రెండో బహుమతి రూ.4,000, మూడో బహుమతి విజేతకు రూ. 3,000 నగదు బహుమతిని ఉంటుంది. ఆదివారం ఉదయం 9 గంటలకు ముగ్గుల పోటీలు ప్రారంభం కానున్నాయి. ఆసక్తి ఉన్న మహిళ లు పోటీలో పాల్గొనవచ్చు. ము గ్గుల పోటీల్లో పాల్గొనే మహిళలు 9740581428, 9900167475 గల సెల్‌ నంబర్లకు కాల్‌ చేసి పేరు రిజిస్టర్‌ చేసుకోవాలి.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Jan 06 , 2024 | 11:15 AM