Bombay High Court: మావోయిస్టు లింక్ కేసులో ఆరుగురిని నిర్దోషులుగా తేల్చిన బాంబే హైకోర్టు..
ABN , Publish Date - Mar 05 , 2024 | 12:30 PM
మావోయిస్టు లింక్ కేసులో జిఎన్ సాయిబాబా, హేమ్ మిశ్రా, మహేష్ టిర్కీ, విజయ్ టిర్కీ, నారాయణ్ సాంగ్లికర్, ప్రశాంత్ రాహి, పాండు నరోటే (మరణించిన)లను బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది. హైకోర్టు గతంలో నిర్దోషిగా విడుదల చేసిన ఉత్తర్వును సుప్రీంకోర్టు కొట్టివేయడంతో సాయిబాబా అప్పీల్‌ను బాంబే హైకోర్టు రిహిల్ చేసింది.
ఢిల్లీ: మావోయిస్టు (Maoist) లింక్ కేసులో జిఎన్ సాయిబాబా, హేమ్ మిశ్రా, మహేష్ టిర్కీ, విజయ్ టిర్కీ, నారాయణ్ సాంగ్లికర్, ప్రశాంత్ రాహి, పాండు నరోటే (మరణించారు)లను బాంబే హైకోర్టు (Bombay High Court) నాగ్‌పూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది. హైకోర్టు గతంలో నిర్దోషిగా విడుదల చేసిన ఉత్తర్వును సుప్రీంకోర్టు (Supreme Court)కొట్టివేయడంతో సాయిబాబా అప్పీల్‌ను బాంబే హైకోర్టు మళ్లీ విచారించింది. జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి ఎస్‌ఏతో కూడిన ధర్మాసనం తీర్పును వెల్లడించింది. మావోయిస్టు సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురు నిందితులను బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది.
Loksabha Elections 2024: మరో 15 రోజుల్లో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్..?
BJP: ఓపీఎస్, దినకరన్‌తో బీజేపీ చర్చలు
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.