Chennai: నాలుగేళ్లలో 36,137 మంది బాలికలకు గర్భం..
ABN , Publish Date - May 16 , 2024 | 12:55 PM
గడిచిన నాలుగేళ్లలోనే రాష్ట్రంలో 36,137 మంది బాలికలు గర్భం దాల్చినట్లు ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానం అందింది. రాణిపేట జిల్లా మనపాక్కం ప్రాంతానికి చెందిన న్యాయవాది, పిల్లల హక్కుల కార్యకర్త సి.ప్రబాకరన్(C. Prabakaran), రాష్ట్రంలో 2021 నుంచి 18 ఏళ్లు నిండని మైనర్ బాలికలు గర్భం దాల్చిన వివరాలు వెల్లడించాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.
- ఆర్టీఐ ద్వారా వెలుగులోకి..
చెన్నై: గడిచిన నాలుగేళ్లలోనే రాష్ట్రంలో 36,137 మంది బాలికలు గర్భం దాల్చినట్లు ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానం అందింది. రాణిపేట జిల్లా మనపాక్కం ప్రాంతానికి చెందిన న్యాయవాది, పిల్లల హక్కుల కార్యకర్త సి.ప్రబాకరన్(C. Prabakaran), రాష్ట్రంలో 2021 నుంచి 18 ఏళ్లు నిండని మైనర్ బాలికలు గర్భం దాల్చిన వివరాలు వెల్లడించాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆయనను అందిన సమాధానం లో పలు దిగ్ర్భాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ప్రకారం, 18 ఏళ్లు నిండకుండా 2021 నుంచి 2014 వరకు గర్భం దాల్చిన బాలికలు 2021 లో 14,031 మంది, 2022లో 10,901, 2023లో 9,565, 2024 జనవరి-ఫిబ్రవరి నెలల్లో 1,637 మంది ఉన్నారు.
ఇదికూడా చదవండి: మహిళ మెడికల్ ఆఫీసర్‌లపై లైంగిక వేధింపులు.. కామారెడ్డి డీఎంహెచ్‌ఓపై కేసు..
జిల్లాల వారీగా...
జిల్లాల వారీగా బాలికలు గర్భం దాల్చిన ఐదు జిల్లాల వివరాలు...
- 2021లో సేలం జిల్లాలో 859 మంది, కృష్ణగిరిలో 711, తిరుచ్చిలో 681, మదురైలో 648, తిరువళ్లూర్ జిల్లాలో 591 మంది
- 2022లో సేలం జిల్లాలో 661 మంది, తిరుచ్చిలో 551, దిండుగల్‌లో 513, చెంగల్పట్టులో 508, కోయంబత్తూర్ జిల్లాలో 490 మంది
- 2023లో తిరుచ్చి జిల్లాలో 579 మంది, మదురైలో 567, సేలంలో 524, దిండుగల్‌లో 496, ఈరోడ్ జిల్లాలో 431 మంది
- 2024లో మదురై జిల్లాలో 156, సేలంలో 135, తిరుచ్చిలో 113, ఈరోడ్‌లో 77, చెన్నై జిల్లాలో 49 మంది
ఇక, కోవిడ్ వ్యాప్తి చెందిన 2021లో మాత్రమే అత్యధికంగా 14,031 మంది బాలికలు వివాహం కాకుండానే గర్బం దాల్చారు. అలాగే, సేలం జిల్లాలో గత నాలుగేళ్లలో 2,179 మంది బాలికలు గర్భం దాల్చగా, రెండో స్థానంలో తిరుచ్చిలో 1,924 మంది వివాహం కాకుండా గర్భవతులయ్యారు. మూడో స్థానంలో మదురై జిల్లాలో 1,371 మంది ఉండగా, చెన్నై జిల్లా వరకు 2024 జనవరి, ఫిబ్రవరి రెండు నెలల్లోనే 49 మంది బాలికలు గర్భం దాల్చినట్లు ఆర్టీఐ ద్వారా తెలిసింది.
ఇదికూడా చదవండి: పోలింగ్ రోజున.. తగ్గిన పొల్యూషన్
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News