Share News

Delhi : భారత్‌కు జలాంతర్గామి విధ్వంసక వ్యవస్థ

ABN , Publish Date - Aug 25 , 2024 | 03:54 AM

జలాంతర్గామి విధ్వంసక వ్యవస్థను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్‌ ఆమోదం తెలిపారు.

Delhi : భారత్‌కు జలాంతర్గామి విధ్వంసక వ్యవస్థ

న్యూఢిల్లీ, ఆగస్టు 24: జలాంతర్గామి విధ్వంసక వ్యవస్థను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్‌ ఆమోదం తెలిపారు. సుమారు రూ.442 కోట్లు(52.8 మిలియన్‌ డాలర్లు) విలువైన యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ సోనోబోయొ్‌సను భారత్‌కు విక్రయించనున్నట్టు వాషింగ్టన్‌లోని డిఫెన్స్‌ సెక్యూరిటీ కో-ఆపరేషన్‌ ఏజెన్సీ(డీఎ్‌ససీఏ) శనివారం వెల్లడించింది.

నాలుగు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం శుక్రవారం పెంటగాన్‌లో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌తో చర్చలు జరిపిన అనంతరం ఈ ప్రకటన వెలువడటం విశేషం.

Updated Date - Aug 25 , 2024 | 03:54 AM