Share News

K Ram Mohan Naidu: విమాన ప్రయాణికులకు శుభవార్త..!

ABN , Publish Date - Nov 10 , 2024 | 04:50 PM

విమాన ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఎయిర్ పోర్టుల్లో ఎకనామిక్ జోన్లు ఏర్పాటు చేసి.. అందులో తక్కువ ధరకు ఆహారం, పానీయాలను అందించేందుకు కసరత్తు చేస్తుంది.

K Ram Mohan Naidu: విమాన ప్రయాణికులకు శుభవార్త..!

న్యూఢిల్లీ, నవంబర్ 10: బయట షాపుల్లో వస్తువుల ధర కాస్తా తక్కువగా ఉంటాయి. అదే ఎయిర్‌‌పోర్ట్‌లో ఏ వస్తువు ధర అయినా.. ఆకాశాన్ని అంటి ఉంటాయి. చివరకు ఆహార పదార్ధాలు, శీతల పానీయాల ధరలు సైతం భారీగా పెంచి దుకాణదారులు విక్రయిస్తారు. దీంతో పలువురు విమాన ప్రయాణికులు ఎయిర్ పోర్టులో ఆకలి వేసినా.. ఆయా షాపుల వైపు మాత్రం కన్నెత్తి కూడా చూడరన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇదే అంశంపై పలువురు ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా తమ స్పందన తెలియజేశారు. దీనిపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది.

Also Read: CM Revanth Reddy: పాలమూరుని అభివృద్ధి చేసుకోనివ్వండి


ఈ నేపథ్యంలో ఆ శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఉన్నతాధికారులతో సమావేశమై.. చర్చించారు. ఆ క్రమంలో దేశవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్ట్‌లలో ఎకనామిక్ జోన్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ జోన్లలో విమాన ప్రయాణికులకు అందుబాటు ధరల్లో ఆహార పదార్ధాలతోపాటు పానీయాలు సైతం ఉంచాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ అంశంపై ఇప్పటికే మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఉన్నతాధికారులతో పలు ధపాలుగా చర్చించారు. కానీ అవి ప్రస్తుతానికి ఒక కొలిక్కి మాత్రం రాలేదు. దీనిపై మరికొద్ది రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది.

Also Read: PM Modi: జార్ఖండ్‌ను దోచుకున్న సోరెన్ సర్కార్


అయితే ఈ ఎకనామిక్ జోనల్లో విమాన ప్రయాణికులు కూర్చుని తినే సదుపాయం అయితే ఉండదు. ఈ జోన్లలో ఆహారాన్ని అక్కడే నుంచుని తినాల్సి ఉంటుంది. అలాగే ఆయా జోన్లలో ఆహారాన్ని కొనుగోలు చేసి తీసుకు వెళ్లే సౌలభ్యాన్ని సైతం ప్రయాణికులకు కల్పించనున్నారని సమాచారం. ఈ తరహా జోన్లు అందుబాటులోకి రావడం వల్ల.. ప్రయాణికుల జేబుపై కొంత భారం తగ్గనుంది. మరోవైపు సెప్టెంబర్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లోని షాపులో టీ తాగారు.


ఆ క్రమంలో ఆయన వద్ద నుంచి రూ. 340 వసూల్ చేశారు. ఓ టీ బ్యాగ్‌తోపాటు వేడి నీరుకు రూ. 340 చెల్లించాల్సి వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. మాజీ మంత్రి చిదంబరం పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే ఎయిర్‌పోర్టుల్లో ఆహార పదార్ధాల ధరలు భారీగా ఉండడంతో.. ప్రయాణికుల నుంచి పౌర విమానయాన శాఖకు ఫిర్యాదులు సైతం వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ శాఖ చర్యలు చేపట్టేందుకు సమాయత్తమైంది. దీనిపై త్వరలో కేంద్ర పౌరవిమానయాన శాఖ ఓ నిర్ణయం తీసుకోనుంది. ఎయిర్ పోర్టులో ఈ జోన్లను నిర్మించాల్సి ఉంది. అంటే వీటి ఏర్పాటుకు మరికొద్ది సమయం పట్టే అవకాశముందని తెలుస్తుంది.

For National news And Telugu News

Updated Date - Nov 10 , 2024 | 04:54 PM