Share News

డీఆర్‌డీవో కొత్త రైఫిల్‌ ‘ఉగ్రం’

ABN , Publish Date - Jan 10 , 2024 | 05:09 AM

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఓ కొత్త రైఫిల్‌ను రూపొందించింది. ఓ ప్రైవేటు సంస్థతో కలిసి పుణెలోని డీఆర్‌డీవో లేబొరేటరీ ఏఆర్‌డీఈలో రూపొందించిన ఈ రైఫిల్‌కు ‘ఉగ్రం’ అనే పేరు పెట్టింది.

డీఆర్‌డీవో కొత్త రైఫిల్‌ ‘ఉగ్రం’

పుణె, జనవరి 9: భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఓ కొత్త రైఫిల్‌ను రూపొందించింది. ఓ ప్రైవేటు సంస్థతో కలిసి పుణెలోని డీఆర్‌డీవో లేబొరేటరీ ఏఆర్‌డీఈలో రూపొందించిన ఈ రైఫిల్‌కు ‘ఉగ్రం’ అనే పేరు పెట్టింది. నాలుగు కిలోల కన్నా తక్కువ బరువు, 7.62/51 ఎంఎం నమూనాతో తయారు చేసిన ఉగ్రం రైఫిల్‌ను ఈ నెల 8న ఏఆర్‌డీఈ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఎస్‌వీ గడే ఆవిష్కరించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రైఫిల్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు.

Updated Date - Jan 10 , 2024 | 06:47 AM