Share News

Hero Vijay: అక్టోబర్‌లో టీవీకే మహానాడు

ABN , Publish Date - Sep 17 , 2024 | 12:35 PM

సినీనటుడు విజయ్‌(Actor Vijay) నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) తొలి మహానాడు అక్టోబర్‌ మూడో వారంలో నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ నెల 23న విక్రవాండిలో ఈ మహానాడును నిర్వహించేందుకు పోలీసుల అనుమతి లభించినప్పటికీ ఆ మహానాడు నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేపట్టలేదు.

Hero Vijay: అక్టోబర్‌లో టీవీకే మహానాడు

- విజయ్‌ అభిమానుల్లో నిరాశ

చెన్నై: సినీనటుడు విజయ్‌(Actor Vijay) నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) తొలి మహానాడు అక్టోబర్‌ మూడో వారంలో నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ నెల 23న విక్రవాండిలో ఈ మహానాడును నిర్వహించేందుకు పోలీసుల అనుమతి లభించినప్పటికీ ఆ మహానాడు నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేపట్టలేదు. దీంతో మహానాడు తేదీని విజయ్‌ వాయిదా వేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కళగం పేరుతో అట్టహాసంగా రాజకీయ పార్టీని ప్రారంభించి రాజకీయ ప్రవేశం చేసిన విజయ్‌ ఆగస్టు 22న పార్టీ పతాకాన్ని కూడా పరిచయం చేశారు. పార్టీ తొలిమహానాడులో పార్టీ సిద్ధాంతాలను వివరిస్తానని కూడా ప్రకటించారు. విజయ్‌ పార్టీని ప్రారంభించినప్పటి నుండి కడలూరుకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు చంద్రశేఖర్‌(Chandrasekhar) సూచనలు స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదికూడా చదవండి: Delh CM: ఢిల్లీ కొత్త సీఎం ఎంపిక.. ప్రకటించిన కేజ్రీవాల్


ఆ జ్యోతిష్యుడి సూచన మేరకే ఆగస్టు 22న పార్టీ పతాకాన్ని విడుదల చేశారు. పార్టీ తొలి మహానాడును మదురై, తిరుచ్చి, కోయంబత్తూరు ఏదో ఒక నగరంలో అట్టహాసంగా నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. చివరకు విల్లుపురం జిల్లా విక్రవాండి సమీపంలో ఉన్న వి. సాలై అనే ప్రాంతం వద్ద వందెకరాల ఖాళీ స్థలంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ ప్రకటించి పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసారు.. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానలివ్వటం, చివరకు ఈ నెల 23న మహానాడు జరిపేందుకు పోలీసులు అనుమతివ్వటం కూడా చకచకా జరిగాయి.

యి.


ఇక మహానాడు నిర్వహణకు భారీ ఏర్పాట్లు ప్రారంభమవుతాయని అందరూ అనుకున్నారు. పోలీసులు అనుమతిచ్చిన రోజున పార్టీ ప్రముఖులు మహానాడు స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో మహానాడు ఏర్పాట్లు ఏవీ జరుగలేదు. ఇదిలా ఉండగా విజయ్‌ నిర్దేశిత తేదీలోనే పార్టీ మహానాడును అట్టహాసంగా జరుపుతారని భావిస్తున్న ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు మహానాడుకు తరలిరండి అంటూ గోడలపై పెయింటింగ్‌లు, ప్రదాన కూడళ్ల వద్ద బ్యానర్లు, కటౌట్లు కట్టే పనులను ప్రారంభించారు.


అన్ని చోట్లా పోస్టర్లు, గోడలపై, బ్యానర్లు, కటౌట్లపై మహానాడు జరిగే తేదీ మినహా తక్కిన వివరాలన్నీ ఉన్నాయి. విజయ్‌ తేదీని అధికారికంగా ప్రకటిస్తే పోస్టర్లు, బ్యానర్లపై వెనువెంటనే ఆ వివరాలను రాసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితులలో పార్టీ మహానాడును అక్టోబర్‌ మూడో వారానికి వాయి దా వేశారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే విజయ్‌ నుంచి మాత్రం ఎలాంటి అధికారికా ప్రకటన రాకపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.


....................................................................

ఈ వార్తను కూడా చదవండి:

....................................................................

Chennai: 12 ఏళ్లకు ఒకసారి వికసించే ‘కురింజి’

- సరికొత్త అందాలతో నీలగిరి

చెన్నై: ఊటీ(Ooty) సమీపం ఎప్పనాడు కొండ ప్రాంతాల్లో, 12 ఏళ్లకు ఒకసారి పూసే ‘కురింజి’ పూలు వికసించడం ప్రారంభించాయి. ఈ ప్రాంతంలోని కొండపై సంతరించుకున్న పూల అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కురింజి పూలమొక్కలకు పలు ప్రత్యేకతలున్నాయి. నీలం కురింజి పూలమొక్కలు కొండ ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతుంటాయి. మొక్క ఎత్తు 30 నుంచి 60 సెం.మీ వరకు ఉంటుంది. మూడేళ్లకు ఒకసారి పూసే మొక్కల నుంచి, 12 ఏళ్లకు ఒకసారి వికసించేవి అని పలురకాల కురింజి మొక్కలున్నాయి. ‘స్ట్రోఫైల్లాన్‌థస్‌ కుంతియానస్‌’ అనే శాస్ర్తీయ నామం కలిగిన కురింజి పూలు 12 ఏళ్ల అనంతరం ఊటీ సమీపం ఎప్పనాడు, బిక్కనాడు కొండ అంచుల్లో వికసిస్తున్న పూలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

nani2.jpg


ఇదికూడా చదవండి: Jani Master: జానీ మాస్టర్‌పై..లైంగిక దాడి కేసు

ఇదికూడా చదవండి: Rajagopal Reddy: పొద్దుగాల ఈ తాగుడేంది?

ఇదికూడా చదవండి: BRS: రేవంత్‌రెడ్డిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం ..

Read LatestTelangana NewsandNational News

Updated Date - Sep 17 , 2024 | 01:16 PM