GDP: మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. నిర్మలా కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 10 , 2024 | 08:21 PM
భారత్.. రానున్న ఐదేళ్లలో మూడో అతిపెద్ధ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ధీమా వ్యక్తం చేశారు.
ఢిల్లీ: భారత్.. రానున్న ఐదేళ్లలో మూడో అతిపెద్ధ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆమె వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ లో మాట్లాడుతూ.. "2027-28 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్లకుపైగా జీడీపీతో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ప్రస్తుతం 50 కోట్ల మందికి పైగా భారతీయులకు బ్యాంకు అకౌంట్లున్నాయి. 9 ఏళ్లలో భారత్ 595 బిలియన్ డాలర్ల ఫారెన్ ఇన్వెస్ట్ మెంట్ సాధించింది. రానున్న అయిదేళ్లలో దేశ జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లను మించిపోతుంది.
ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ భారత్ కంటే ముందువరుసలో ఉన్నాయి. 2023 వరకు గడిచిన 23 ఏళ్లలో భారత్ 919 బిలియన్ డాలర్ల ఫారెన్ పెట్టుబడులు పొందింది. 2014లో కేవలం 15 కోట్ల మందికి మాత్రమే బ్యాంక్ అకౌంట్లుండగా.. ఇప్పటివరకు వారి సంఖ్య 50 కోట్లకు పెరిగింది" అని అన్నారు.