Share News

Jamili Elections Bill: సభలో ప్రవేశ పెట్టిన జమిలి ఎన్నికల బిల్లు

ABN , Publish Date - Dec 17 , 2024 | 12:25 PM

జమిలి ఎన్నికల సవరణ బిల్లును మంగళవారం పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశ పెట్టునుంది. అందుకోసం సర్వం సిద్దం చేసింది. 2029లో ఈ జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది.

Jamili Elections Bill: సభలో ప్రవేశ పెట్టిన జమిలి ఎన్నికల బిల్లు

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: జమిలి ఎన్నికల సవరణ బిల్లు.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేుఘవాల్ మంగళవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును విపక్షాలు కాంగ్రెస్ తోపాటు సమాజవాదీ పార్టీలు వ్యతిరేకించాయి. అందులోభాగంగా పార్లమెంట్ లో విపక్షాలు నిరసన బాటు పట్టాయి. బిల్లును ఉప సంహరించుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాజ్యాంగ స్పూర్తిని ఈ బిల్లు దెబ్బతీస్తోందంటూ ఎంపీ మనీష్ తివారి విమర్శించారు. అయితే ఈ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే.. 361 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. అంటే బిల్లు ఆమోదానికి రెండింట మూడు వంతుల మెజార్టీ అవసరం అవుతోంది.


ఉభయ సభల్లో సభ్యుల బలబలాలు..

ఇక లోక్ సభలో మొత్తం 542 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఎన్డీయే కూటమికి 293 మంది బలం ఉండగా.. ఇండియా భాగస్వామ్య పక్షాలకు 234 సభ్యులు ఉన్నారు. అలాగే రాజ్యసభలో 237 మంది సభ్యులు ఉండగా.. ఎన్డీయే కూటమి 114 మంది సభ్యులు ఉన్నారు. ఇండియాకు 85 మంది సభ్యుల బలం ఉంది.

Also Read: ఫర్ ది పీపుల్, బై ది పీపుల్‍కు స్వస్తి పలికిన పాలకులు


2029 ఎన్నికలే లక్ష్యంగా..

2029లో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాకాలు చేస్తోంది. అంటే ఇటు సార్వత్రిక.. అటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏక కాలంలో నిర్వహించాలని భావిస్తోంది. అలాగే 2034 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు సైతం జమిలి పరిధిలోకి రానున్నాయని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే జమిలి ఎన్నికలకు ఉన్న అడ్డంకులను సైతం కేంద్రం పరిశీలిస్తోంది. అందులోభాగంగా వివిధ రాజకీయ పార్టీలను ఒప్పించి.. రాజ్యాంగ సవరణలు సాఫీగా జరిగేలా చూడడంపై కేంద్రం ఇప్పటికే దృష్టి సారించింది. ఆ క్రమంలో జనాభా లెక్కల సేకరణ, నియోజకవర్గాల పునర్ విభజన అంశాలను సైతం ఈ లోపు పూర్తి చేయాలని భావిస్తోంది. ఆ క్రమంలో వచ్చే ఏడాది జనాభా లెక్కల సేకరణ, 2027 నాటికి నియోజకవర్గాల పునర్ విభజన, మహిళా రిజర్వేషన్ అమలు చేసే నియోజకవర్గాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Also Read: ట్రైయినీ వైద్యురాలి ఘటనలో ఏం జరిగిందో..?


బిల్లుల ఆమోదం కోసం..

మరోవైపు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు వీప్ జారీ చేశాయి. మంగళవారం సభ ముందుకు కీలక బిల్లులు రానున్నాయని... ఈ నేపథ్యంలో సభకు అందరూ హాజరు కావాలంటూ ఆయా పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేసింది.

Also Read: మహిళామణులకు గుడ్ న్యూస్ .. మళ్లీ తగ్గిన పసిడి ధర


అందుకే వన్ నేషన్ .. వన్ ఎలక్షన్ బిల్లు..

దేశంలో ప్రతి ఏడాది ఎక్కడో అక్కడ.. ఎప్పుడో అప్పుడు.. ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. దీని వల్ల ప్రజా ధనం భారీగా ఖర్చవుతోంది. అలాగే అధికారులు సైతం అధిక సమయం ఈ ఎన్నికల కోసం పని చేయాల్సి వస్తోంది. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలు అమలుకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతోన్నాయి. పోలీసులు, భద్రతా సిబ్బందిని పోలింగ్ కేంద్రాల తరలించాల్సి ఉంటుంది. ఇదో పెద్ద ప్రహాసనంగా మారింది. ఈ తరహా సమస్యలు ప్రతి ఏడాది ప్రభుత్వానికి ఎదురవుతోన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అటు సార్వత్రిక ఎన్నికలు, ఇటు అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read: బైడెన్ నిర్ణయంపై ట్రంప్ అభ్యంతరం


బిల్లు ఆమోదం పొందితే..

తద్వారా సమయంతోపాటు ప్రజా ధనం సైతం ఆదా అవుతోందని.. అలాగే ప్రజా సంక్షేమ పథకాలు సైతం ప్రజలకు ఏటువంటి ఆటంకాలు లేకుండా అమలు చేయవచ్చని ఆలోచించింది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలను తెర మీదకు తీసుక వచ్చింది. అందుకు సంబంధించిన బిల్లులోని సవరణల కోసం మంగళవారం పార్లమెంట్ ముందుకు తీసుకు వచ్చింది. అందరిని ఒక తాటిపైకి తీసుకు వచ్చి.. ఈ బిల్లు ఆమోదం పొందితే.. 2029 ఏడాదిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి.

For National News And Terlugu News

Updated Date - Dec 17 , 2024 | 01:23 PM