Share News

BJP Chief: బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగింపు..!

ABN , Publish Date - Jul 14 , 2024 | 04:15 PM

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను ఈ ఏడాది చివర వరకు కొనసాగించే అవకాశాలున్నాయి. దీంతో కొత్త సంవత్సరంలో కొత్త అధ్యక్షుడిని బీజేపీ అగ్రనాయకత్వం నియమించనుందని తెలుస్తుంది. అసలు అయితే జేపీ నడ్డా పార్టీ అధ్యక్ష పదవి గతంలోనే పూర్తయింది.

BJP Chief: బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగింపు..!

న్యూఢిల్లీ, జులై 14: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను ఈ ఏడాది చివర వరకు కొనసాగించే అవకాశాలున్నాయి. దీంతో కొత్త సంవత్సరంలో కాస్తా అటు ఇటుగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. అసలు అయితే జేపీ నడ్డా పార్టీ అధ్యక్ష పదవి గతంలోనే పూర్తయింది. అయితే 2024, జూన్ వరకు ఆయన పదవి కాలాన్నీ పొడిగించారు. దీనిని మళ్లీ పొడిగించనున్నారని సమాచారం. గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన జేపీ నడ్డాను.. ఆ సభలో బీజేపీ పక్ష నేతగా నియమించారు. అలాగే మోదీ కేబినెట్‌లో ఆరోగ్య, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ మంత్రిగా ఆయనకు కీలక భాద్యతలు కట్టబెట్టారు. ఇక ఆగస్ట్ 1వ తేదీ నుంచి బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం ప్రక్రియ ప్రారంభం కానుంది.

Also Read: Puri Ratna Bhandar: పూరీలో తెరుచుకున్న రత్నభాండాగారం.. లోపలకి వెళ్లిన బృందం


అందులోభాగంగా జిల్లా, రాష్ట్ర యూనిట్లలో పార్టీ బలోపేతం కోసం సభ్యత్వ నమోదు ప్రక్రియ మొదలవుతుంది. అది సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. అనంతరం సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రచారం నడుస్తుంది. ఆ తర్వాత క్రియాశీల సభ్యత్వ నమోదు పరిశీలన అక్టోబర్ 1 నుంచి 15 వరకు సాగనుంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ నిబంధనల ప్రకారం.. పార్టీలోని ప్రతి ఒక్కరు 9 ఏళ్లకొక్కసారి సభ్యత్వ నమోదును రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది.

దీంతో ప్రధాని మోదీతోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు మొదలుకొని ప్రతి ఒక్కరు తమ తమ సభ్యత్వ నమోదును రెన్యువల్ చేయించుకోనున్నారు. ఇక నవంబర్ 1 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు మండల ప్రెసిడెంట్ల ఎన్నికలను నిర్వహించనుంది. ఆ తర్వాత నవంబర్ 16 నుంచి 30వ తేదీ వరకు జిల్లా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు.

Also Read: AP DGP: ఎవరైనా దాడులకు పాల్పడితే.. సహించేది లేదు


అలా రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన వారంతా పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. అంటే డిసెంబర్ 1వ తేదీ అనంతరం జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఇంకోవైపు సెప్టెంబర్‌లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం ఈ ఏడాది చివర లేకుంటే వచ్చే ఏడాది తొలినాళ్లలో మహారాష్ట్ర, ఝార్ఖండ్, హరియాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల పూర్తయ్యే వరకు బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డానే కొనసాగనున్నారనేది సుస్పష్టమైంది.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 14 , 2024 | 04:29 PM