Share News

Maharashtra: కొనసాగుతున్న సస్పెన్స్.. కీలక సమావేశం రద్దు, సొంత గ్రామానికి షిండే

ABN , Publish Date - Nov 29 , 2024 | 02:46 PM

కొత్త ప్రభుత్వంలో పదవుల పంపకాలపై చర్చించేందుకు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్‌తో సహా షిండే గురువారంనాడు ఢిల్లీలో అమిత్‌షా, జేపీ నడ్డాలను కలిసారు. అగ్రనేతలతో సానుకూల చర్చలు జరిగాయని కూడా సమావేశానంతరం షిండే తెలిపారు.

Maharashtra: కొనసాగుతున్న సస్పెన్స్.. కీలక సమావేశం రద్దు, సొంత గ్రామానికి షిండే

న్యూఢిల్లీ: ఇదిగో..అదిగో అంటూ మహారాష్ట్ర సీఎం ఎవరనేదే దానిపై అధికారిక ప్రకటనలో జాప్యం కొనసాగుతోంది. ఈ సస్పెన్స్ మధ్య ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే రెండు కీలక సమావేశాలను రద్దు చేసుకుని తన స్వగ్రామమైన సతారా వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ప్రభుత్వంలో పదవుల పంపకాలపై చర్చించేందుకు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్‌తో సహా షిండే గురువారంనాడు ఢిల్లీలో అమిత్‌షా, జేపీ నడ్డాలను కలిసారు. అగ్రనేతలతో సానుకూల చర్చలు జరిగాయని కూడా సమావేశానంతరం షిండే తెలిపారు.

Maharashtra CM: ఎట్టకేలకు మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపిక.. ఉప ముఖ్యమంత్రులుగా..


విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, ముంబై తొలుత బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం నిర్వహించి నాయకుడిని ఎన్నుకుంటారు. అనంతరం మహాయుతి కూటమి సంయుక్త సమావేశం జరగాల్సి ఉంది. కాగా, షిండే సైతం ఢిల్లీ నుంచి ముంబైకి తిరిగి బయలేదే ముందు మీడియాతో మాట్లాడుతూ, ముంబైలో మహాయుతి కూటమి మరోసారి సమావేశమవుతుందని, తదుపరి సీఎం ఎవరనే దానిపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఢిల్లీలో చర్చలు జరిపామని, వాటిని కొనసాగిస్తామని అన్నారు. తదుపరి నిర్ణయం ఏదీ తీసుకున్నా అందరికీ తెలియజేస్తామని మీడియాకు చెప్పారు. దీనికి ముందు కూడా షిండే మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌షా తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని, ప్రభుత్వానికి తాను అడ్డుకాదని చెప్పారు.


'మహాయూతి' కూటమి కొత్త ప్రభుత్వంలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై అమిత్‌షాతో జరిపిన గంట సమావేశంలో ఒక అవగాహనకు వచ్చినట్టు చెబుతున్నప్పటికీ అధికారిక ప్రకటన అయితే ఇంకా విడుదల కాలేదు. డిసెంబర్ 2న కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేస్తుందని, బీజేపీకి సీఎం పదవి, శివసేన, ఎన్‌సీపీ నుంచి చెరో ఉపముఖ్యమంత్రి నియామకాలకు అమిత్‌షా ఆమోదం తెలిపారని సమాచారం.


ఇవి కూాడ చదవండి

MP Kanimozhi: ఆ జాలర్లను విడిపించండి..

Chennai: హాయిగా ఊపిరి పీల్చుకోండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 29 , 2024 | 03:12 PM