National: ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలకు ప్రభుత్వ ఉద్యోగుల హాజరుపై నిషేధం ఎత్తివేత వెనుక ఏదైనా వ్యూహం ఉందా..?
ABN , Publish Date - Jul 25 , 2024 | 10:05 AM
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాలకు ప్రభుత్వ ఉద్యోగుల హాజరుపై ఉన్న నిషేధాన్ని కేంద్రప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో 58 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో అధికారికంగా పాల్గొనే అవకాశం కలిగింది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాలకు ప్రభుత్వ ఉద్యోగుల హాజరుపై ఉన్న నిషేధాన్ని కేంద్రప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో 58 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో అధికారికంగా పాల్గొనే అవకాశం కలిగింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంతోనే ఇది సాధ్యమైంది.కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిషేధం ఏవైనా మార్పులు ఉండబోతున్నాయా అనే చర్చ కూడా సాగుతోంది. నిషేధం ఉన్నప్పటికీ ఆర్‌ఎస్ఎస్ నిర్వహించే ఎన్నో కార్యక్రమాలకు ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యేవారు. కానీ అధికారికంగా పాల్గొనేవారు కాదు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే మాత్రం విచారణ చేసి చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎలాంటి భయం లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సంఘ్ కార్యక్రమాల్లో పాల్గొనే వెసులుబాటు కలిగింది.
Nirmala Sitaraman: బడ్జెట్‌పై 'వివక్ష' ముద్ర దారుణం.. మండిపడిన నిర్మలా సీతారామన్
ఏవైనా మార్పులు ఉంటాయా..
నిషేధం ఉన్న సమయంలోనూ ప్రభుత్వ ఉద్యోగులు రహస్యంగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. తమ ఉద్యోగ భవిష్యత్తు గురించి భయపడేవారు. కానీ ప్రస్తుతం అలాంటి భయం అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు బహిరంగంగా ఆర్‌ఎస్‌ఎస్‌కు తమ మద్దతు ప్రకటించవచ్చు. కేంద్రంలోనూ, పదికి పైగా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉండటంతో ఈ నిర్ణయంతో ఆర్‌ఎస్‌ఎస్‌కు లాభం చేకూరనుంది. హిందూ భావజాలం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు గతంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆలోచన ఉన్నప్పటికీ నిషేధం కారణంగా దూరంగా ఉంటూ వచ్చేవారు. ప్రస్తుతం నిషేధం ఎత్తివేతతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ మంది సంఘ్ వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది.
Bangladesh: సీఎం మమత వ్యాఖ్యలపై స్పందించిన బంగ్లాదేశ్
మరింత వేగంగా..
ప్రభుత్వ ఉద్యోగులు సంఘ్ కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంతో ప్రభుత్వ ఉద్యోగులతో నేరుగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు సంబంధాలు ఏర్పరుచుకుంటారు. ఇది తమ నెట్వర్క్‌ను బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆర్‌ఎస్‌ఎస్ తన ఆలోచనలను మరింత వేగంగా విస్తరించడంతో పాటు.. ఎక్కువమంది దగ్గరకు తన భావజాలాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏర్పడినప్పటి నుంచి మూడుసార్లు నిషేధిం విధించారు. గాంధీ హత్య తర్వాత తొలిసారి నిషేధం విధించగా.. రెండోసారి ఎమర్జెన్సీ సమయంలోనూ, మూడోసారి బాబ్రీ కూల్చివేత సమయంలో నిషేధం విధించారు. తర్వాత కాలంలో సంఘ్‌పై నిషేధం ఎత్తివేసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనే ఆదేశం ఇప్పటికీ అమలులో ఉంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు సంఘ్ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు.. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు పొందటంలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో యువకులు సైతం సంఘ్‌కు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎక్కువమంది సంఘ్‌కు దగ్గరయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాదికి సంఘ్ శతాబ్ధి ఉత్సవాలను నిర్వహించుకోనుంది. తాజా నిర్ణయంతో ఆర్‌ఎస్‌ఎస్ భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం ఏర్పడనుంది.
Watch Video: సోనియాగాంధీ, జయాబచ్చన్ కలుసుకున్న వేళ...
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News