One Nation One Election Bill: జమిలీ ఎన్నికల బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే
ABN , Publish Date - Dec 09 , 2024 | 08:19 PM
ఒకే దేశం-ఒకే ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదించింది. దీనిపై ఏకాభిప్రాయం సాధించి, విస్తృత సంప్రదింపుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ పంపాలని కేంద్రం యోచిస్తున్నట్టు చెబుతున్నారు.
న్యూఢిల్లీ: ఒకే దేశం-ఒకే ఎన్నికల (One Nation-One Elections) విధానాన్ని అమలు చేసే దిశగా మరో ముందడుగు పడనుంది. పార్లమెంటు నుంచి ఎన్నికల వరకూ ఒకేసారి అన్ని ఎన్నికలను నిర్వహించే 'జమిలి' ఎన్నికల బిల్లును ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. ఒకే దేశం-ఒకే ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదించింది. దీనిపై ఏకాభిప్రాయం సాధించి, విస్తృత సంప్రదింపుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ పంపాలని కేంద్రం యోచిస్తున్నట్టు చెబుతున్నారు.
Mamata Banerjee: దురాక్రమణకు వస్తే భారతీయులు లాలీపాప్ తింటూ కూర్చుంటారా?.. దీదీ ఫైర్
జేపీసీ ఏర్పాటు ద్వారా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సంప్రదింపులు జరపడం, సంబంధిత భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పిచాలని ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. కాగా, ఏకాభిప్రాయం లేకుండా ప్రస్తుతం ఉన్న ఎన్నికల వ్యవస్థలో మార్పులు చేయడం పెనుసవాలే అవుతుంది. 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' ప్లాన్ అమలు చేయాలంటే పలు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని రామ్‌నాథ్ కోవిడ్ కమిటీ సైతం సిఫారసు చేసింది. ఇందుకు ప్రభుత్వానికి పార్లమెంటులో (ఉభయసభల్లో) మూడింట రెండువంతుల మెజారిటీ అవసరమవుతుంది. ఉభయ సభల్లో ఎన్డీయేకు సాధారణ మెజారిటీ మాత్రమే ఉన్నందున మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడమనేది కష్టమైన పనే అవుతుంది.
ఉభయసభల్లో మెజారిటీ ఎంత?
రాజ్యసభలోని 245 స్థానాలకు ఎన్డీయేకు 112 మంది సభ్యుల బలం ఉండగా, విపక్ష పార్టీలకు 85 మంది సభ్యుల బలం ఉంది. మూడింట రెండువంతుల మెజారిటీ అంటే కనీసం 164 ఓట్లు కావాలి. లోక్‌సభలో మొత్తం 545 స్థానాల్లో ఎన్డీయేకు 292 స్థానాలున్నాయి. ముడింట రెండువంతుల మెజారిటీకి 364 ఓట్లు అవసరం. అయితే, ఓటింగ్‌కు హాజరైన సభ్యుల సంఖ్య ఆధారంగా మెజారిటీ లెక్కలు మారతాయి.
ఎవరి వాదన ఎలా ఉంది?
ఏకకాలంలో ఎన్నికలు (జమిలీ) జరపడం వల్ల సమయం, ఖర్చు వంటివి ఆదా అవుతాయని, తద్వారా వేగవంతమైన ఆర్థికవృద్ధి సాధ్యమని కేంద్ర ప్రభుత్వ వాదనగా ఉంది. కాగా, ఈ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ మనుగడకు ఇప్పుడున్న పద్ధతిలోనే ఎన్నికల నిర్వహించాలని అంటోంది.
ఇవి కూడా చదవండి..