Plane Crash: రోడ్డుపై రెండు ముక్కలైన విమానం
ABN , Publish Date - Dec 13 , 2024 | 05:31 AM
అది బిజీగా ఉండే హైవే. మధ్యాహ్నం 3 గంటల సమయం. రోడ్డుపై కార్లు రయ్ రయ్‌మని దూసుకుపోతున్నాయి.
ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో ప్రమాదం.. అంతా సేఫ్
టెక్సాస్, డిసెంబరు 12: అది బిజీగా ఉండే హైవే. మధ్యాహ్నం 3 గంటల సమయం. రోడ్డుపై కార్లు రయ్ రయ్‌మని దూసుకుపోతున్నాయి. ఇంతలో ఓ విమానం నేలబారుకు వచ్చింది. అంతా చూస్తుండగానే నాలుగు రోడ్ల కూడలిలో కూలి రెండు ముక్కలైంది. ఇంత ప్రమాదం జరిగినా పైలట్ సేఫ్‌గా ఉన్నాడు. ఈ ఘటన అమెరికాలోని దక్షిణ టెక్సా్‌సలో జరిగింది. పోలీస్ అధికారి ఇలైన్ మోయా తెలిపిన వివరాల ప్రకారం.. రెండు ఇంజన్ల చిన్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం కిందకి వచ్చింది. అది టెక్సా్‌సలోని విక్టోరియాలో స్టేట్ హైవే లూప్ 463 వద్ద రోడ్డుపై దిగే క్రమంలో పలు వాహనాలను ఢీకొట్టి ముక్కలైంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ నలుగురిలో ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. అత్యవసర సేవల సిబ్బంది వెంటనే వచ్చి రోడ్డుపై పడ్డ విమాన శకలాలను తొలగించారు.