Sudarshan Setu Bridge: దేశంలో అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతు బ్రిడ్జ్‌ని ప్రారంభించిన ప్రధాని మోదీ..వీడియో
ABN , Publish Date - Feb 25 , 2024 | 10:46 AM
గుజరాత్‌లోని ద్వారకలో అరేబియా సముద్రంపై నిర్మించిన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన 'సుదర్శన్ సేతు'ను ప్రధాని మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. దీని విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
గుజరాత్(gujarat) అరేబియా సముద్రంలోని బేట్ ద్వారకా ద్వీపాన్ని ఓఖా ప్రధాన భూభాగానికి కలిపే దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన 'సుదర్శన్ సేతు(Sudarshan Setu Bridge)'బ్రిడ్జ్‌ని ప్రధాని నరేంద్ర మోదీ(narendra Modi) ఆదివారం ప్రారంభించారు. బీట్ ద్వారక(dwaraka)లోని శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత మోదీ తన రోజును ప్రారంభించారు. దీని తర్వాత ఆయన 'సుదర్శన్ సేతు' పేరుతో ఉన్న నాలుగు లేన్ల కేబుల్ వంతెనను ప్రారంభించారు.
ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ వంతెనకు ఇరువైపులా భగవద్గీతలోని శ్లోకాలు, శ్రీకృష్ణుని(srikrishna) చిత్రాలతో అలంకరించబడిన నడక మార్గం ఉంది. అధికారిక ప్రకటన ప్రకారం 2.32 కిలోమీటర్ల పొడవైన వంతెనను రూ. 979 కోట్లతో నిర్మించారు. మధ్యలో 900 మీటర్ల పొడవైన కేబుల్-స్టేడ్ స్పాన్, వంతెనపైకి చేరుకోవడానికి 2.45 కిలోమీటర్ల పొడవైన రహదారి ఉంది.
నాలుగు లైన్ల 27.20 మీటర్ల వెడల్పు ఉన్న ఈ వంతెన(cable stayed bridge)కు ఇరువైపులా 2.50 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లు ఉన్నాయి. ఈ వంతెనను గతంలో 'సిగ్నేచర్ బ్రిడ్జ్' అని పిలిచేవారు. ఇప్పుడు దాని పేరు 'సుదర్శన్ సేతు'గా మార్చబడింది. బేట్ ద్వారకా అనేది ఓఖా నౌకాశ్రయానికి సమీపంలో ఉన్న ఒక ద్వీపం. ద్వారకా నగరానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీకృష్ణుని ప్రసిద్ధ ద్వారకాధీష్ ఆలయం ఉంది.
వంతెన నిర్మాణానికి ముందు యాత్రికులు బైట్ ద్వారకకు చేరుకోవడానికి పడవ రవాణాపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ వంతెన నిర్మాణంతో వారు ఎప్పుడైనా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. ఈ వంతెన నిర్మాణానికి 2016 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అక్టోబర్ 7, 2017న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(modi) శంకుస్థాపన చేశారు. లక్షద్వీప్‌లో నివసించే ప్రజలు కూడా దీని వల్ల ప్రయోజనం పొందుతారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Drugs racket: రూ.2000 కోట్ల డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టు రట్టు.. సినీ నిర్మాత కీలక సూత్రధారి