Rajya Sabha bypolls: పెద్దల సభకు ఏపీ, హర్యానా, ఒడిశా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
ABN , Publish Date - Dec 09 , 2024 | 03:24 PM
షెడ్యూల్ ప్రకారం రాజ్యసభకు ఉప ఎన్నికలు డిసెంబర్ 20న నిర్వహిస్తారు. అదేరోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, హర్యానా నుంచి ఆరుగురు సభ్యులను రాజ్యసభకు ఎంపిక చేయాల్సి ఉంది.
న్యూఢిల్లీ: రాజ్యసభకు జరిగే ఉప ఎన్నికల్లో (Rajya Sabha bypolls) మూడు రాష్ట్రాల నుంచి పోటీ చేసే తమ అభ్యర్థుల పేర్లను భారతీయ జనతా పార్టీ (BJP) సోమవారంనాడు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హర్యానా నుంచి వీరు పోటీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య, ఒడిశా నుంచి సుజీత్ కుమార్, హర్యానా నుంచి రేఖా శర్మ పోటీ చేస్తున్నారు.
Delhi Assembly Elections: సిసోడియా సీటు మార్పు, 13 సిట్టింగ్‌లకు దక్కని చోటు
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్
షెడ్యూల్ ప్రకారం రాజ్యసభకు ఉప ఎన్నికలు డిసెంబర్ 20న నిర్వహిస్తారు. అదేరోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, హర్యానా నుంచి ఆరుగురు సభ్యులను రాజ్యసభకు ఎంపిక చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 సీట్లు, ఒడిశా, పశ్చిమబెంగాల్, హర్యానా నుంచి ఒక్కో సీటు ఖాళీగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎంపీలను రాజ్యసభకు పంపాల్సి ఉంది. జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఎంపీలు వెంకటరమణ రావు మోపిదేవి, బీద మస్తాన్ రావు యాదవ్, రాగ్య కృష్ణయ్య రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఆ మూడు స్థానాలకు ఎన్నిక అనివార్యమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ ఈ మూడు సీట్లు గెలుచుకోవడం ఖాయమనే చెప్పాలి.
ఒడిశా: నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజు జనతా దళ్ (బీజేడీ) ఎంపీ సుజీత్ కుమార్ రాజ్యసభకు రాజీనామా చేశారు. బీజేపీ ఈ సీటును గెలుచుకునే అవకాశం ఉంది.
పశ్చిమబెంగాల్: అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన జవహర్ సర్కార్ రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఉపఎన్నికల్లో ఈ సీటును టీఎంసీ సునాయాసంగా గెలుచుకోనుంది.
హర్యానా: అధికార బీజేపీకి చెందిన కృష్ణలాల్ పన్వర్ రాజ్యసభ సీటుకు రాజీనామా చేశారు. ఈ సీటను బీజేపీ తిరిగి నిలబెట్టుకోనుంది. హర్యానాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజ్యసభ సీటుకు పన్వర్ రాజీనామా చేసారు. ప్రస్తుతం ఆయన నయబ్ సింగ్ షైని మంత్రివర్గంలో అభివృద్ధి, పంచాయతీరాజ్, గనులు, భూగర్భ శాఖ మంత్రిగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
పాక్‌కు బంగ్లా మరింత చేరువ!
Vikram Misri: హిందువులపై దాడులు.. బంగ్లాదేశ్ చేరుకున్న విదేశాంగ కార్యదర్శి
For National News And Telugu News