PM Swearing-in-ceremony: ప్రధాని ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు షురూ.. తేదీ ఎప్పుడంటే..?
ABN , Publish Date - Jun 03 , 2024 | 09:23 PM
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మంగళవారంనాడు వెలువడనున్న నేపథ్యంలో కొత్త ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార వేదిక వద్ద చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై సెక్యూరిటీ ఏజెన్సీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ వారాంతంలోనే ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండొచ్చని చెబుతున్నారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మంగళవారంనాడు వెలువడనున్న నేపథ్యంలో కొత్త ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార వేదిక (Venue) వద్ద చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై సెక్యూరిటీ ఏజెన్సీలు దృష్టి సారిస్తు్న్నాయి. ఈ వారాంతంలోనే ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండొచ్చని చెబుతున్నారు.
Congress: కౌంటింగ్ రోజు రాత్రి ఢిల్లీలోనే ఉండండి... 'ఇండియా' బ్లాక్ నేతలకు కాంగ్రెస్ దిశానిర్దేశం
రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం..
సెక్యూరిటీ సన్నాహాలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు, కేంద్ర భద్రతా ఏజెన్సీలు సమావేశమైనట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో భాగంగా బహుళ అంచెల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై భద్రతా ఏజెన్సీలు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారం ఉంటుందని, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. ప్రమాణస్వీకార వేదికలో మార్పు ఉంటే, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. ప్రధాని ప్రమాణస్వీకారం జూన్ 9 లేదా 10వ తేదీలో ఉండొచ్చని మరో అధికారి తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 12 మంది విదేశీ ప్రముఖులు సహా 10,000 మంది ప్రజలు ఈ వేడుకలో పాల్గొంటారని తెలుస్తోంది.
Read Latest National News and Telugu News