London: కొవిషీల్డ్‌తో దుష్ప్రభావాలు
ABN , Publish Date - Apr 30 , 2024 | 05:18 AM
యూకేకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కొవిడ్ టీకా కొవిషీల్డ్‌తో అత్యంత అరుదుగా రక్తం గడ్డకట్టే అవకాశముందని సంస్థ అంగీకరించింది.
లండన్, ఏప్రిల్ 29: యూకేకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కొవిడ్ టీకా కొవిషీల్డ్‌తో అత్యంత అరుదుగా రక్తం గడ్డకట్టే అవకాశముందని సంస్థ అంగీకరించింది. ఆక్స్‌ఫర్డ్ వర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా కొవిడ్ వ్యాక్సిన్లను తయారు చేసింది.
వాటిని కొవిషీల్డ్, వాక్స్‌జెవ్రియా పేర్లతో ప్రపంచవ్యాప్తంగా విక్రయించింది. అయితే ఆస్ట్రాజెనెకా టీకాలు తీసుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలు వచ్చిన పలువురు యూకేలోని ఓ హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో భాగంగా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఈ టీకా వల్ల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలున్నాయని సంస్థ వెల్లడించింది.