Elections 2024: వీవీ ప్యాట్‌లు లెక్కించాలని డిమాండ్.. వివరణ కోరిన సుప్రీం
ABN , Publish Date - Apr 02 , 2024 | 10:08 AM
లోక్ సభ ఎన్నికల ( Lok Sabha Elections ) కోసం కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నోటిఫికేషన్ ప్రకటించిన ఈసీ ఎన్నికలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. కొన్నేళ్ల క్రితం బ్యాలెట్ విధానంలో ఎన్నికల క్రతువు జరిగేది. కానీ మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న సాంకేతికత కారణంగా ఈవీఎం లు అందుబాటులోకి వచ్చాయి.
లోక్ సభ ఎన్నికల ( Lok Sabha Elections ) కోసం కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నోటిఫికేషన్ ప్రకటించిన ఈసీ ఎన్నికలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. కొన్నేళ్ల క్రితం బ్యాలెట్ విధానంలో ఎన్నికల క్రతువు జరిగేది. కానీ మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న సాంకేతికత కారణంగా ఈవీఎం లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈవీఎం విధానంపై పలు రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ పరిణామాలపై స్పందించిన అధికారులు ఎవరికి ఓటు వేశారో తెలుసుకునేందుకు వీలుగా వీవీప్యాట్ ను అమలుపరిచింది. అయినప్పటికీ ఈ విధానంపై ఉన్న అపోహలు తగ్గలేదు. ఎన్నికల్లో అన్ని వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం ఎన్నికల సంఘం, కేంద్రం నుంచి స్పందన కోరింది. నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.
Crime News : నా భర్తను చంపితే రూ.50 వేలు ఇస్తా.. సంచలనంగా మారిన వాట్సాప్ స్టేటస్..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) (ఎ), 21 ప్రకారం వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛ ప్రాథమిక హక్కుల్లో భాగం. 2013 లో సుబ్రమణియన్ స్వామి వర్సెస్ భారత ఎన్నికల సంఘం కోర్టు ఆదేశాలతో ఓటరు తాను ఏ అభ్యర్థికి ఓటు వేశారో తెలుసుకునే హక్కును పొందారు. కాబట్టి ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల కౌంటింగ్ మాత్రమే కాకుండా వీవీ ప్యాట్ లను లెక్కించి విజేతను ప్రకటించాలని పిటిషనర్ కోరారు.
Andhra Pradesh: ఆ సినిమా ప్రదర్శనలను ఆపేయండి.. కోర్టును ఆశ్రయించిన దస్తగిరి..
దాదాపు 24 లక్షల వీవీప్యాట్ ల కొనుగోలుకు ప్రభుత్వం దాదాపు రూ.5 వేల కోట్లు ఖర్చు చేసిందని పిటిషన్ లో జత చేశారు. ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణ మే 17న జరిగే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.