Share News

Tamilnadu Hooch tragedy: తమిళనాడులో ఘోర విషాదం.. కల్తీసారా తాగి 10 మంది మృతి

ABN , Publish Date - Jun 19 , 2024 | 09:17 PM

తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. కల్లకురిచి జిల్లాలో కల్తీ సారా తాగి 10 మంది మృతి చెందారు. నలభై మందికి పైగా అస్వస్థతకు గురికావడంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సీబీసీఐడీ విచారణకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశించారు.

Tamilnadu Hooch tragedy: తమిళనాడులో ఘోర విషాదం.. కల్తీసారా తాగి 10 మంది మృతి

చెన్నై: తమిళనాడు (Tamilnadu) లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కల్లకురిచి (Kallkurichi)లో కల్తీ సారా (illicit liquor packet arrack) తాగి 10 మంది మృతి చెందారు. నలభై మందికి పైగా అస్వస్థతకు గురికావడంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో తీవ్ర ఆందోళన చెందిన బాధిత కుటుంబ సభ్యులు సారా కేంద్ర వద్ద మృతదేహాలతో ఆందోళనకు దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Heat Waves: పెరుగుతున్న మరణాలు.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కీలక ఆదేశాలు


సీబీసీఐడీ దర్యాప్తునకు సీఎం ఆదేశం

కాగా, కల్తీ సారా మృతుల ఘటనపై సీబీసీఐడీ విచారణకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ శ్రావణ్ కుమార్‌ బదిలీకి ఆదేశాలు ఇచ్చారు. కల్లకురిచి కొత్త కలెక్టర్‌గా ఎంసీ ప్రశాంత్‌ను నియమించారు. జిల్లా ఎస్పీ సమయ్ సింగ్ మీనాను సైతం సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో కొత్త ఎస్పీగా రాజ్‌నాథ్ చతుర్వేదిని ప్రభుత్వం నియమించారు. పలువురు పోలీసులు అధికారులను సైతం సస్పెన్షన్‌లో ఉంచారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 19 , 2024 | 09:17 PM