Share News

Tamilisai: మైనార్టీలకు మోదీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు..

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:22 PM

ప్రధాని మోదీ మైనార్టీలను వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణా మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌(Former Governor of Telangana Tamilisai Soundarrajan) పేర్కొన్నారు.

Tamilisai: మైనార్టీలకు మోదీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు..

- మాజీ గవర్నర్‌ తమిళిసై

చెన్నై: ప్రధాని మోదీ మైనార్టీలను వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణా మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌(Former Governor of Telangana Tamilisai Soundarrajan) పేర్కొన్నారు. కోవై విమానాశ్రయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో తొలివిడత లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఇందుకు ఎన్నికల కమిషన్‌ను అభినందించాలన్నారు. అయితే ఓటర్ల జాబితాలో లక్షలాది మంది పేర్లు లేవని, ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదికూడా చదవండి: రూ. 25 వేల కోట్ల స్కాంలో సునేత్రకు క్లీన్‌చిట్‌

ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఇటీవల ఓ బహిరంగసభలో మాట్లాడుతూ... కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో హనుమాన్‌ చాలీసా వినడం కూడా నేరమేనని వ్యాఖ్యానించారని, ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్‌, ఇండియా కూటమి ప్రధానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. దేశంలో గృహిణుల సంక్షేమం కోసం దాదాపు 10 కోట్లకు పైగా ఉచిత గ్యాస్‌సిలిండర్లను కేంద్ర ప్రభుత్వం పంపిణి చేసిందని, అందులో సగానికి పైగా లబ్దిపొందుతున్నది ఇస్లామీయులేనని చెప్పారు. దేశంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలను కేంద్ర ప్రభుత్వం సమానంగా భావిస్తోందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ మహిళా హక్కుల గురించి మాట్లాడుతున్నారని అయితే, ముస్లిం మహిళలు ఒంటరిగా హజ్‌ యాత్ర చేపట్టేందుకు ఆయన ఎటువంటి చర్యలు తీసుకోలేదని తమిళిసై విమర్శించారు.

ఇదికూడా చదవండి: Summer special trains: 27 నుంచి వేసవి ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి
ఎక్కడివరకంటే..

Read Latest National News and Telugu News

Read Latest National News and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 12:30 PM