TRAI: ప్రతి ఓటీపీని బ్యాంకు ధ్రువీకరించాల్సిందే
ABN , Publish Date - Nov 30 , 2024 | 05:23 AM
టెలికం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) డిసెంబరు 1 నుంచి కొత్త నిబంధనను అమల్లోకి తెస్తోంది.
ఆ తర్వాతే వినియోగదారుడికి సందేశం
రేపటి నుంచి ట్రేసబిలిటీ మార్గదర్శకాలు
ట్రాయ్ ఆదేశం అమలుకు టెలికం సంస్థలు
సిద్ధం.. మోసపూరిత సందేశాలకు తెర!
ఆ తర్వాతే వినియోగదారుడికి సందేశం
న్యూఢిల్లీ, నవంబరు 29: టెలికం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) డిసెంబరు 1 నుంచి కొత్త నిబంధనను అమల్లోకి తెస్తోంది. ట్రేసబిలిటీ గైడ్‌లైన్స్‌గా పిలుస్తున్న ఆ నిబంధనల ప్రకారం టెలికం సంస్థలు వినియోగదారులకు వచ్చే ఓటీపీలు నిజమైనవా? కాదా? ధ్రువీకరించుకొని మాత్రమే డెలివరీ చేస్తాయి. ముందు ఓటీపీలు నిర్ణీత ఫార్మట్‌లో ఉన్నాయా? లేదా? చూస్తాయి. ఆ తర్వాత ఓటీపీ సందేశంలో పేర్కొన్న బ్యాంకు లేదా ఈ-కామర్స్ కంపెనీ నుంచే వచ్చిందా? లేదా? అని కూడా ధ్రువీకరించుకుంటాయి. ఆ తర్వాతే వినియోగదారుడికి సందేశాన్ని పంపిస్తాయి. తద్వారా స్పామ్ లేదా మోసపూరిత సందేశాలను చాలా వరకు పరిహరించవచ్చు. అయితే, ఈ మొత్తం ప్రాసెస్ వల్ల ఓటీపీలు కస్టమర్‌కు చేరడానికి సమయం పడుతుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.