Share News

MCD Meet: ఆప్‌‌కు కౌన్సిలర్లు షాక్.. కీలకమైన ఎంసీడీ మీట్‌కు ముందు బీజేపీలోకి జంప్

ABN , Publish Date - Sep 25 , 2024 | 06:34 PM

షెడ్యూల్ ప్రకారం ఎంసీడీ సమావేశం గురువారం జరుగనుంది. ఈ సమావేశంలో ఒక స్టాండింగ్ కమిటీ సభ్యుడిని ఎన్నుకుంటారు. కమల్‌జీత్ షరావత్ ఇటీవల ఎంపీగా ఎన్నికకావడంతో స్టాండింగ్ కమిటీ సభ్యుడి సీటుకు ఖాళీ ఏర్పడింది.

MCD Meet: ఆప్‌‌కు కౌన్సిలర్లు షాక్.. కీలకమైన ఎంసీడీ మీట్‌కు ముందు బీజేపీలోకి జంప్

న్యూఢిల్లీ: కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) సమావేశం మరికొద్ది గంటల్లో జరుగనుండగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు ప్రీతి, సరిత ఫోగట్‌లు బుధవారం ఉదయం బీజేపీలో చేరారు. దిల్షాద్ కాలనీ నంబర్ 217 వార్డుకు ప్రీతి కౌన్సిలర్‌గా ఉండగా, గ్రీన్‌పార్క్ వార్డ్ నెంబర్ 150కి కౌన్సిలర్‌గా ఫోగట్ ఉన్నారు. ఈ ఇద్దరూ ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీలో చేరారు. ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ సచ్‌దేవ, కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా హాజరయ్యారు.


షెడ్యూల్ ప్రకారం ఎంసీడీ సమావేశం గురువారం జరుగనుంది. ఈ సమావేశంలో ఒక స్టాండింగ్ కమిటీ సభ్యుడిని ఎన్నుకుంటారు. కమల్‌జీత్ షరావత్ ఇటీవల ఎంపీగా ఎన్నికకావడంతో స్టాండింగ్ కమిటీ సభ్యుడి సీటుకు ఖాళీ ఏర్పడింది. ఎంసీడీ సమావేశంలో ఈ ఎన్నిక జరుగనుంది.

Haryana Assembly Elections: ఫిర్ ఏక్ బార్ బీజేపీ సర్కార్... జనం నాడి ఇదేనన్న మోదీ


గత్యంతరం లేకనే పార్టీకి గుడ్‌బై

కాగా, పార్టీలో ఉండలేకే ఆప్‌ను వీడినట్టు ప్రీతి తెలిపారు. తాను నాలుగుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యానని, ప్రజల్లోనే ఉంటూ మున్సిపల్ సమస్యల పరిష్కారానికి కృషి చేశానని చెప్పారు. వైవిధ్యం అశించి ఆప్‌లో చేరినప్పటికీ ఇప్పుడు విభిన్నమైన వాతావరణం ఉందని, ఆ వాతావరణంలో ఇమడకలేకనే పార్టీని వీడాల్సి వచ్చిందని చెప్పారు. డ్రైనేజీ సమస్యలు, మురికి జలాల సరఫరా వంటి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి అతిషి కానీ, తన ప్రాంతంలోని స్థానిక ఎమ్మెల్యేగానీ ఎవరూ ఆసక్తి చూపడం లేదన్నారు. కాగా, తమ పార్టీ కౌన్సిలర్లు ఇద్దరు బీజేపీలో చేరడంలో ఆమ్ ఆద్మీ పార్టీ వెంటనే స్పందించలేదు.


ఎంసీడీలో ఆప్, బీజేపీ బలాబలాలు ఇవే..

ఎంసీడీలో ప్రస్తుతం ఆప్‌కు 122 మంది కౌన్సిలర్లు ఉండగా, బీజేపీకి 117 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 2022 డిసెంబర్ ఎన్నికల్లో బీజేపీ 15 ఏళ్ల పాలనకు ఆప్ గండికొట్టింది. మొత్తం 250 ఎంసీడీ వార్డుల్లో 134 వార్డులను ఆప్ కైవసం చేసుకుంది. బీజేపీ 104 వార్డులకే పరిమితమైంది. అయితే ఆ తర్వాత పలువురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలోకి చేరుతూ వచ్చారు.


Read More National News and Latest Telugu News

Also Read: Jammu and Kashmir Assembly Elections: కొనసాగుతున్న రెండో విడత పోలింగ్

Updated Date - Sep 25 , 2024 | 06:40 PM