Yeddyurappa: కాంగ్రెస్ పార్టీని భయం వెంటాడుతోంది..
ABN , Publish Date - Jan 14 , 2024 | 01:15 PM
లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రామమందిర ప్రతిష్ఠాపన బీజేపీకి అనుకూలమవుతుందనే భయం కాం గ్రెస్ వర్గాల్లో వెంటాడుతోందని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప(Former Chief Minister Yeddyurappa) పేర్కొన్నా రు.

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రామమందిర ప్రతిష్ఠాపన బీజేపీకి అనుకూలమవుతుందనే భయం కాం గ్రెస్ వర్గాల్లో వెంటాడుతోందని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప(Former Chief Minister Yeddyurappa) పేర్కొన్నా రు. శనివారం శివమొగ్గలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రామమందిర ప్రతిష్ఠాపనలో అన్ని పార్టీల వారు భాగస్వామ్యులు కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశయంగా ఉందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ వారికి మంచి ఆలోచనలు వచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని హితవు పలికారు. పెజావర పీఠాధిపతి వ్యాఖ్యలను తప్పుపట్టాల్సిన పనిలేదన్నారు.