Share News

Delhi: కేజ్రీవాల్ అరెస్ట్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. బెయిలిస్తే అలా చేయొద్దని సూచన

ABN , Publish Date - May 07 , 2024 | 01:55 PM

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని(Arvind Kejriwal) ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన తన అరెస్టును సవాలు చేస్తూ గతంలోనే సుప్రీం కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిగింది..

Delhi: కేజ్రీవాల్ అరెస్ట్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. బెయిలిస్తే అలా చేయొద్దని సూచన

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని(Arvind Kejriwal) ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన తన అరెస్టును సవాలు చేస్తూ గతంలోనే సుప్రీం కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కి కీలక సూచనలు చేసింది. లోక్‌సభ ఎన్నికల వేళ ఓ పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ధర్మాసనం(Supreme Court) అభిప్రాయపడింది.

బెయిల్‌ మంజూరు చేస్తే ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వర్తించొద్దని సూచించింది. అయితే లిక్కర్ స్కాంపై విచారణ చేపట్టే సమయం ఉన్నందున.. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘ఇది అసాధారణ పరిస్థితి. కేజ్రీవాల్‌ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదు. లోక్‌సభ ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయి. పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది’’ అని కోర్టు అభిప్రాయపడింది.


వ్యతిరేకించిన ఈడీ..

ధర్మాసనం వ్యాఖ్యలను ఈడీ వ్యతిరేకించింది. ఈడీ తరఫు లాయర్లు మాట్లాడుతూ.. ‘‘సీఎం అయినంత మాత్రాన లిక్కర్ కేసును ప్రత్యేకంగా పరిగణించకూడదు. రాజకీయ నాయకులకు మినహాయింపులు ఉండకూడదు. ఇప్పుడు బెయిల్‌ మంజూరు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. మేం పంపిన సమన్లను పట్టించుకోలేదు. దీనికితోడు దర్యాప్తునకు సహకరించట్లేదు. అందుకే అరెస్టు చేయాల్సి వచ్చింది’’ అని ఈడీ.. కోర్టుకు తెలిపింది.

Noida: యూనివర్సిటీ వాటర్ ట్యాంక్‌లో మహిళ మృతదేహం.. అవే నీటిని వాడిన లెక్చరర్ల పరిస్థితి ఎలా ఉందంటే

ఈ వ్యాఖ్యలపై స్పందించిన ధర్మాసనం.. కేసులో బెయిల్ మంజూరైతే సీఎంగా అధికారిక విధుల్లో పాల్గొనడానికి తాము అనుమతించమని తెలిపింది. బెయిల్‌పై విడుదలయ్యాక ఫైళ్లపై సంతకాలు కూడా చేయొద్దని సూచించింది. అయితే లిక్కర్ స్కాం కేసుపై ఇంకా వాదనలు జరుగుతున్నాయి. లంచ్ బ్రేక్ తరువాత కేజ్రీవాల్ బెయిల్ విషయంలో కీలక తీర్పు వెలువడే అవకాశం ఉంది.

Read Latest News and National News Here..

Updated Date - May 07 , 2024 | 02:02 PM