Share News

Myth-Reality : నాటు గుడ్డులో పోషకాలు ఎక్కువ?

ABN , Publish Date - Sep 25 , 2024 | 03:58 AM

తెల్ల గుడ్లు, నాటు గుడ్లు... ఈ రెండూ మార్కెట్లో దొరుకుతున్నాయి. అయితే తెల్ల గుడ్ల కంటే నాటు గుడ్లలోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయనే అపోహ స్థిరపడిపోయింది.

Myth-Reality : నాటు గుడ్డులో పోషకాలు ఎక్కువ?

అపోహ-వాస్తవం

తెల్ల గుడ్లు, నాటు గుడ్లు... ఈ రెండూ మార్కెట్లో దొరుకుతున్నాయి. అయితే తెల్ల గుడ్ల కంటే నాటు గుడ్లలోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయనే అపోహ స్థిరపడిపోయింది. కానీ నిజానికి పోషకాల పరంగా రెండు గుడ్లూ సమానమే! రెండింట్లోనూ ఒకే రకమైన పోషకాలు, ప్రొటీన్‌, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. అలాంటప్పుడు నాటు గుడ్డు పెంకు గోధుమ రంగులో ఎందుకుంది? అనే అనుమానం రావచ్చు. గుడ్లు పెట్టే ప్రక్రియలో, పెంకు మీద పిగ్మెంట్లు చేరుకోవడం వల్లే పెంకు రంగు మారుతుంది. అంతే తప్ప పెంకు రంగు గోధమ రంగులో ఉన్నంత మాత్రాన నాటు గుడ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయను కోవడం అపోహ మాత్రమే!

Updated Date - Sep 25 , 2024 | 03:58 AM