Benefits of Dietary Fiber: పీచుతోనే పక్కా ఆరోగ్యం
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:42 AM
పీచు పేగుల ఆరోగ్యం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం మరియు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆధునిక ఆహారంలో పీచు తగ్గిపోతున్నందున, గోధుమ బ్రెడ్ వంటి పీచుతో నిండిన ఆహారాలను తినడం మంచిది.

ఆహారం ఆరోగ్యం
పీచు ఎక్కువగా ఉండే ఆహారంతో పలు తీవ్రమైన జబ్బుల నుంచి తప్పించుకోవచ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. కానీ శుద్ధి చేసిన పదార్థాలు, పిండిపదార్థాలతో నిండిన ఆధునిక ఆహారాల్లో పీచు కొరవడుతోంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవచ్చో తెలుసుకుందాం!
పేగుల ఆరోగ్యం పెరగడానికీ, రక్తంలో చక్కెర మోతాదులు స్థిరంగా ఉండడానికీ, గుండె పనితీరు మెరుగ్గా ఉండడానికీ పీచు తోడ్పడుతుంది. ఓట్స్, బీన్స్, అవిసె గింజల్లోని నీటిలో కరిగే పీచు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తృణధాన్యాలు, విత్తనాలు, కూరగాయల్లోని నీటిలో కరగని పీచు జీర్ణ శక్తిని పెంచుతుంది. ఇన్ని ప్రయోజనాలున్నప్పటికీ ఆధునిక ఆహారంలో పీచు పాత్ర అంతంతమాత్రంగానే ఉంటోంది. అయితే పీచుతో ఒరిగే ప్రయోజనాలను సొంతం చేసుకోవాలంటే, తీసుకునే ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకోవాలి. తెల్ల బ్రెడ్‌కు బదులుగా పొట్టు తీయని గోధుమలతో తయారైన బ్రెడ్ తినొచ్చు.
తెల్ల బియ్యానికి బదులుగా దంపుడు బియ్యం ఎంచుకోవచ్చు. అలాగే శుద్ధి చేసిన, ఉప్పు జోడించిన స్నాక్స్‌కు బదులుగా నట్స్, సీడ్స్ తినొచ్చు. వంటకాల్లో అవిసెగింజల పొడిని చల్లుకుని తినడం ద్వారా సరిపడా పీచును భోజనంతో పాటు పొందవచ్చు. అంతే కాకుండా...
సలాడ్స్‌లో, భోజనంలో తప్పనిసరిగా అరకప్పు బీన్స్ ఉండేలా చూసుకోవాలి
పండ్లు, కూరగాయలు తొక్క తీయకుండా వాడుకోవాలి. బంగాళాదుంపలు, యాపిల్స్, క్యారట్‌లను తొక్కతీయకుండా తినొచ్చు
వేయించిన వేరుశెనగలు, మఖ్‌నా, తాజా పండ్లను స్నాక్స్‌గా తినొచ్చు.
Read More Business News and Latest Telugu News