Share News

Green Chili for Digestive Health: పచ్చిమిరప రెండంచుల కత్తి

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:20 AM

పచ్చిమిరప కాయలు ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ, వాటిని అధికంగా తీసుకోవడం జీర్ణాశయ సమస్యలు కలిగించవచ్చు. అల్సర్లు ఉన్నవారు, అలాగే ఆరోగ్యానికి ఎక్కువ నష్టం కాకుండా, లేత ఆకుపచ్చ మిరపకాయలు ఉపయోగించడం మంచిది.

Green Chili for Digestive Health: పచ్చిమిరప రెండంచుల కత్తి

పచ్చిమిరప లేనిదే తెలుగు భోజనం పూర్తి కాదు. కొందరికి నాలుకకు కారం చురుకు తగలనిదే భోజనం ఏమాత్రం రుచించదు. అలాగని ప్రతి కూరలో పచ్చిమిరపకాయలను దట్టిస్తే మాత్రం ఆరోగ్యానికి చేటే! ఎందుకో తెలుసుకుందాం!

సమతులాహారంలో ప్రతి కూరగాయకూ ప్రత్యేక పాత్ర ఉంటుంది. అయితే పచ్చిమిరపకు ఈ సూత్రం వర్తించదు. ఒక భోజనంలో ఒక పచ్చిమిరపకాయకు పరిమితమైతే, చర్మం నునుపుగా మారుతుంది. శరీరం శక్తిని ఖర్చు చేసుకునే వేగం పెరుగుతుంది. ఒక భోజనంలో ఒక పచ్చిమిరప, బరువు తగ్గడానికి కూడా కొంతమేరకు సహాయపడుతుంది. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉండే పచ్చిమిరపకాయలను తినడం ఆరోగ్యకరమే అయినప్పటికీ వాటిలోని క్యాప్సేసిన్‌ పరిమాణం ప్రభావం జీర్ణాశయం లోపలి పొరను దెబ్బతీయకుండా ఉండాలంటే, వాటిని పరిమితంగానే తీసుకోవాలంటున్నారు ముంబయిలోని అపోలో స్పెక్ట్రా సీనియర్‌ డైటీషియన్‌, ఫౌజియా అన్సారి.


పచ్చిమిరపకాయలను అతిగా తినడం వల్ల ఛాతీలో మంట, అసిడిటీలు వేధిస్తాయని హెచ్చరిస్తున్నారామె. మరీ ముఖ్యంగా పొట్టలో అల్సర్లు ఉన్నవాళ్లు, పచ్చిమిరపకాయలను వీలైనంత తగ్గించాలనీ, లేదంటే పరిస్థితి మరింత దిగజారుతుందనీ అంటున్నారామె. ఒకవేళ పచ్చిమిరపకాయలను తినడాన్ని ఇష్టపడేవాళ్లైతే, ముదురు ఆకుపచ్చ, లేదా పండు మిరపకాయలకు బదులుగా లేత ఆకుపచ్చ రంగు మిరపకాయలు తినడం మేలని కూడా సూచిస్తున్నారామె.

For Andhrapradesh News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 12:25 AM