Australia: ఆస్ట్రేలియాలో శనివారం నుంచి కొత్త వీసా నిబంధనలు.. ఇక విదేశీ విద్యార్థులకు చుక్కలే!
ABN , Publish Date - Mar 21 , 2024 | 09:48 PM
వలసల కట్టడి కంకణం కట్టుకున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం శనివారం నుంచి కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలను అమలు చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: వలసల కట్టడి కంకణం కట్టుకున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం శనివారం నుంచి కొత్త స్టూడెంట్ వీసా (Student Visa Norms) నిబంధనలను అమలు చేయనుంది. కొత్త నిబంధనల ప్రకారం, ఇంగ్లీష్ భాషా పరీక్ష ప్రమాణాలను మరింత పెంచనున్నారు. అంతేకాకుండా, పదే పదే నిబంధనలు అతి క్రమించి విదేశీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చే సంస్థలపై కూడా ప్రభుత్వం కొరడా ఝళిపిస్తుంది. ‘‘ఈ చర్యలతో వలసలకు బ్రేకులు పడతాయి. వలసల వ్యవస్థను చక్కదిద్దుతామని ఇచ్చిన హామీని నెరవేర్చినట్టవుతుంది’’ అని హోం ఎఫైర్స్ మంత్రి క్లెయిర్ ఓ నీల్ పేర్కొన్నారు.
NRI: సింగపూర్‌లో స్వర లయ ఆర్ట్స్ నిర్వహణలో 2వ వార్షిక త్యాగరాజ ఆరాధనోత్సవాలు
ఇక విద్యార్థులకు జన్యుయిన్ స్టూడెంట్ టెస్టు నిర్వహిస్తారు. విద్యార్థి చదువు కోసం వస్తున్నాడా పని కోసం వస్తున్నాడా అనేది ఈ పరీక్షలో తేలుస్తారు. అంతేకాకుండా, అవసరమైన సందర్భాల్లో విజిటర్ వీసాల పొడిగింపునకు వీలులేకుండా నో ఫర్దర్ స్టే నిబంధన అమలు చేస్తారు.
కొవిడ్ సంక్షోభ సమయంలో తలెత్తిన కార్మికుల కొరత తీర్చుకునేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం వీదేశీయులకు ఆహ్వానం పలికింది. విదేశీ విద్యార్థుల పనిగంటలపై కూడా పరిమితులు ఎత్తేశారు. ఆ తరువాత వీదేశీయులు పోటెత్తడంతో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. వలసలను ప్రోత్సహించడంతో ఆస్ట్రేలియా కంపెనీలకు ఉపయోగం కలిగినా అద్దె ఇళ్లకు డిమాండ్ పెరిగింది. అయితే, వలసల కట్టడికి గత సెప్టెంబర్ నుంచి చేపడుతున్న చర్యలు ఫలితాన్ని (Tightened Norms) ఇస్తున్నాయని హోం అఫైర్స్ శాఖ మంత్రి అన్నారు. గతేడాది స్టూడెంట్ వీసాల జారీ ఏకంగా 35 శాతం మేర తగ్గిందని చెప్పారు.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి