కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి.. సీఎం నివాళులు
ABN, Publish Date - Sep 27 , 2024 | 12:58 PM
హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన త్యాగశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్, మైనంపల్లి రోహిత్, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన త్యాగశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి..

కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్, మైనంపల్లి రోహిత్, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి.

స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తు్న్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రక్కన ఎమ్మెల్యే వివేక్..

కరీంనగర్ జిల్లాలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మేయర్ సునీల్ రావు పాల్గొన్న పద్మశాలి సంఘం నాయకులు..

ఆదిలాబాద్ జిల్లాలో కొండ లక్ష్మణ్ బాబు 109 జయంతిని పురస్కరించుకుని కలెక్టర్.. సంఘ నాయకులు నివాళులు అర్పించారు..
Updated at - Sep 27 , 2024 | 12:58 PM