హైదరాబాద్‌లో కుండపోత వర్షం దృశ్యాలు..
ABN, Publish Date - May 17 , 2024 | 08:13 AM
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెట్లు, కొమ్మలు విద్యుత్తు తీగలపై విరిగిపడటంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం వరకు నగరంలో ఎర్రటి ఎండలే కాయగా.. 3 గంటల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై భారీ వర్షం పడింది. యూసుఫ్‌గూడలో 9 సెం.మీ., బంజారాహిల్స్ వెంకటేశ్వరకాలనీ 8.7 సెం.మీ, మలక్‌పేటలో 8.5, బేగంబజార్‌లో 8.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
Updated at - May 17 , 2024 | 08:13 AM