హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. ఫోటోలు చూశారా..
ABN, Publish Date - Apr 03 , 2025 | 04:33 PM
Rains in Hyderabad: హైదరాబాద్‌లో గురువారం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నడుములోతు నీళ్లు నిలిచిపోయాయి. వర్షం తీవ్రత దృశ్యాలను ఇక్కడ చూడొచ్చు..

హైదరాబాద్‌లో గురువారం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నడుములోతు నీళ్లు నిలిచిపోయాయి.

గురువారం నాడు హైదరాబాద్‌లో ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది.

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆ వెంటనే భారీ ఉరుములతో వర్షం కురిసింది.

దాదాపు గంట పాటు భారీ వర్షం నగర వ్యాప్తంగా దంచికొట్టింది.

వర్షం ధాటికి నగరంలోని పలు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.

లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. రోడ్లపై వర్షపు నీరు భారీగి నిలిచిపోయింది.

బైక్స్ మునిగిపోయే ఎత్తులో నీరు ప్రవహించింది. అమీర్‌పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
Updated at - Apr 03 , 2025 | 04:37 PM