Share News

Viral Video: 900 ఏళ్ల నాటి గుడిలో వెకిలి వేషాలు.. టెంపుల్ రన్ గేమ్‌ను రీ-క్రియేట్ చేస్తూ పరుగులు.. చివరకు..

ABN , Publish Date - Aug 30 , 2024 | 03:10 PM

సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ప్రజలు రకరకాల ట్రిక్కులు ఉపయోగిస్తున్నారు. పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తూ పాపులర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. చారిత్రక ప్రదేశాల్లో అగౌరవంగా ప్రవర్తిస్తున్నారు.

Viral Video: 900 ఏళ్ల నాటి గుడిలో వెకిలి వేషాలు.. టెంపుల్ రన్ గేమ్‌ను రీ-క్రియేట్ చేస్తూ పరుగులు.. చివరకు..
A man recreated the 'Temple Run' video game in a temple

సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ప్రజలు రకరకాల ట్రిక్కులు ఉపయోగిస్తున్నారు. పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తూ పాపులర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. చారిత్రక ప్రదేశాల్లో అగౌరవంగా ప్రవర్తిస్తున్నారు. బాగా పాపులర్ అయిన టెంపుల్ రన్ (Temple Run) గేమ్‌ను రీక్రియేట్ చేసేందుకు ఓ వ్యక్తి 900 ఏళ్ల (900-year-old temple) పురాతనమైన అంగ్‌కోర్ వాట్ (Angkor Wat) దేవాలయంలో పరుగులు తీశాడు. అతను మాత్రమే కాదు.. చాలా మంది ఇటీవలి కాలంలో అంగ్‌కోర్ వాట్ దేవాలయంలో టెంపుల్ రన్ తరహాలో పరుగులు తీస్తున్నారు (Viral Video).


కంబోడియాలోని 900 ఏళ్ల నాటి హిందూ-బౌద్ధ దేవాలయమైన అంగ్‌కోర్ వాట్‌ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు దక్కించుకుంది. అంతటి చరిత్ర కలిగిన ఆలయంలో యూట్యూబ్, టిక్‌టాక్ వినియోగదారులు టెంపుల్ రన్ గేమ్‌ను అనుకరిస్తూ పరుగులు తీస్తూ వీడియోలు తీసుకుంటున్నారు. ఆలయ శిధిలాలలో పరుగెత్తడం, దూకడం, గోడలను ఢీకొట్టడం వంటి పనులు చేస్తున్నారు. ఆ వీడియోలకు ఫన్ సౌండ్ ఎఫెక్ట్‌లను జోడించి సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. ఇలాంటి విన్యాసాల వల్ల దాదాపు 900 ఏళ్ల నాటి కట్టడాలు తీవ్రంగా దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు


వైరల్ కంటెంట్ కోసం, పవిత్ర స్థలాలను అగౌరవపరస్తున్నారని, ఇది పురాతన సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని పరిరక్షకులు భయపడుతున్నారు. ఇది దేవాలయాన్ని భౌతికంగా నష్టపరచడమే కాదు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువను కూడా అగౌరవపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇలాంటి వీడియోలకు సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ భారీగా వస్తున్నాయి. ఈ దేవాలయంలో చిత్రీకరించిన చాలా వీడియోలు 20 లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ వరుడు ధోనీ కంటే స్పీడ్‌గా ఉన్నాడు.. మరదలికి మెరుపు వేగంతో షాకిచ్చాడు.. వీడియో వైరల్


Optical Illusion: డైనోసర్ల మధ్య ఉన్న బల్బును కనిపెట్టండి.. మీ పరిశీలనా శక్తి ఏపాటిదో తెలుసుకోండి..


Viral Video: కేవలం రూ.50కే పలు వెరైటీలతో లంచ్.. ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఏంటంటే..


Viral Video: ఇదేం పని నాగరాజా.. బెడ్రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు చుట్టుకున్న నాగుపాము.. ఫ్యాన్ వేస్తే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 30 , 2024 | 03:10 PM