TamilNadu: మహిళా కస్టమర్ తిట్లు.. డెలివరీ ఏజెంట్ ఆత్మహత్య!
ABN , Publish Date - Sep 19 , 2024 | 10:03 PM
కస్టమర్ తిట్టడాన్ని తట్టుకోలేక ఓ డెలివరీ ఏజెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు ఓ సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: చెన్నైలో ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్ బలవన్మరణానికి పాల్పడ్డారు. కస్టమర్ తిట్టడంతో మానసిక వ్యధకు లోనయ్యానంటూ సూసైడ్ లేఖ రాసి అతడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది (Viral).
Viral: భారతీయులు రోజుకు రూ.600 పొదుపు చేయాలన్న బిలియనీర్‌పై ఘాటు విమర్శలు!
పూర్తి వివరాల్లోకి వెళితే, పవిత్రన్ అనే 19 ఏళ్ల టీనేజర్ బీకామ్ చదువుతున్నాడు. అతడు డెలివరీ ఏజెంట్‌గా కూడా పనిచేస్తున్నాడు. కాగా, సెప్టెంబర్ 11న అతడు కొరట్టూర్ ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళకు ఫుడ్ డెలివరీ చేశాడు. అయితే, ఆమె మాత్రం పవిత్రన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుడ్ డెలివరీలో జాప్యంపై సీరియస్ అయ్యింది. దీంతో, ఇద్దరి మధ్యామాటామాటా పెరిగింది. చివరకు ఆమె అతడిపై ఫిర్యాదు చేసింది.
Anand Mahindra: మానవాళికి ఎలాన్ మస్క్ ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్! ఆనంద్ మహీంద్రా ప్రశంస!
ఇది జరిగిన రెండు రోజులకు వివాదం మరో మలుపు తిరిగింది. పవిత్రన్ తన ఇంటిపై రాయి వేసి కిటికీ అద్దం పగలగొట్టాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, బుధవారం అనూహ్యంగా పవిత్రన్ ఆత్మహత్య చేసుకున్నాడు. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డ అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఘటనా స్థనంలో వారికి పవిత్రన్ రాసిన సూసైడ్ నోట్ కూడా లభించింది. ‘‘నా ఆత్మహత్యకు కారణం ఆ కస్టమరే. ఆమె తిట్టడంతో నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఇలాంటి మహిళలు ఉన్నంతవరకూ ఇలాంటి మరణాలు తప్పవు’’ అని సూసైడ్ నోట్‌లో ఉంది. కాగా, పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Russia: ఆఫీసుల్లో శృంగారంలో పాల్గొనండి.. రష్యా అధ్యక్షుడి కొత్త సూచన!