Chennai: అనారోగ్యంతో భార్య మృతి.. గుడి కట్టి ఆరాధిస్తున్న భర్త
ABN , Publish Date - May 10 , 2024 | 12:55 PM
కష్టానష్టాల్లో తోడునీడగా నిలిచిన భార్య హఠాత్తుగా మృతి చెందటంతో చలించిపోయిన భర్త, ఆమె జ్ఞాపకాలను పదిలపరచుకునేలా గుడికట్టి కుంభాభిషేకం జరిపి ఆరాధిస్తున్నాడు.
చెన్నై: కష్టానష్టాల్లో తోడునీడగా నిలిచిన భార్య హఠాత్తుగా మృతి చెందటంతో చలించిపోయిన భర్త, ఆమె జ్ఞాపకాలను పదిలపరచుకునేలా గుడికట్టి కుంభాభిషేకం జరిపి ఆరాధిస్తున్నాడు. అరియలూరు(Ariyalur) జిల్లా దేవమంగళం గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామంలోని గాంధీనగర్ ప్రాంతంలో గోపాలకృష్ణన్ (42), కర్పగవళ్ళి (36) అనే భార్యాభర్తలు నివసించేవారు. గోపాలకృష్ణన్ తిరుప్పూరులో జనపనార కర్మాగారాన్ని నడుపుతున్నారు. వీరికి ఐదేళ్ల వయస్సు కలిగిన కోమగన్ అనే కుమారుడున్నాడు.
ఇదికూడా చదవండి: CM Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీ మధ్యంతర బెయిల్‌పై నేడు సుప్రీం తీర్పు
కర్పగవళ్ళి కిడ్నీలు దెబ్బతినడంతో ఆమె చికిత్స కోసం గోపాలకృష్ణన్(Gopalakrishnan) లక్షలాది రూపాయలను ఖర్చుపెట్టాడు. కానీ రెండు కిడ్నీలు ఒకే సమయంలో చెడిపోవటంతో గతయేడాది ఆమె తుదిశ్వాస విడిచింది. కర్పగవళ్లి మృతిదేహాన్ని గోపాలకృష్ణన్ తన ఇంటి సమీపంలోని స్థలంలోనే ఖననం చేశారు. అక్కడే రూ.15లక్షల వ్యయంతో ఆమెకు గుడికట్టాడు. ఆ గుడి గర్భాలయంలో మూడడగుల కర్పగవళ్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. గుడి నిర్మాణ పనులన్నీ ముగియడంతో బుధవారం వేదపండితులను రప్పించి కుంభాభిషేకం నిర్వహించారు. ప్రస్తుతం ఆ ఊరివాసులంతా ఈ గుడిని చూసి గోపాలకృష్ణన్‌ను మెచ్చుకుంటున్నారు.
ఇదికూడా చదవండి: Prajval Revanna Scandal Case: రేవణ్ణ కేసులో ఊహించని ట్విస్ట్.. తనను బెదిరించి ఆరోపణలు చేయించారన్న మహిళ
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News