Share News

Viral: డ్రైవర్ దణ్ణం పెట్టగానే వదిలేసిన ఏనుగు..లేకపోతే వీళ్లు ఏమైపోయేవారో!? షాకింగ్ వీడియో

ABN , Publish Date - Mar 22 , 2024 | 05:03 PM

టూరిస్టులపై అకస్మాత్తుగా దాడి చేసిన ఏనుగు, నెట్టింట్లో కలకలం రేపుతున్న వైరల్ వీడియో

Viral: డ్రైవర్ దణ్ణం పెట్టగానే వదిలేసిన ఏనుగు..లేకపోతే వీళ్లు ఏమైపోయేవారో!? షాకింగ్ వీడియో

ఇంటర్నెట్ డెస్క్: జంతువులు ఎప్పుడు ఏం చేస్తాయో అస్సలు ఊహించడం కష్టం. ఏనుగులు, ఖడ్గమృగాలకు తిక్క రేగితే దారుణాలకు అంతే ఉండదు. ఓ ఏనుగు కారణంగా సఫారీలో దాదాపు ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా (Viral Video) మారింది. ఆఫ్రికాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం నెటిజన్లతో గగ్గోలు పెట్టిస్తోంది.

Viral: 81 ఏళ్ల మహిళకు కడుపు నొప్పి.. 56 ఏళ్లుగా ఆమె కడుపులో ఉన్నది ఇదా అంటూ నివ్వెరపోయిన వైద్యులు!


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కొందరు టూరిస్టులు పెద్ద ట్రక్కులో సఫారీ (Safari) కోసం అడవిలోకి వెళ్లారు. వాళ్లకు ఓ పెద్ద మగ ఏనుగు ఎదురుపడింది. తొలుత ప్రశాంతంగానే కనిపించిన ఆ ఏనుగు మెల్లమెల్లగా ఒక్కో అడుగూ వేస్తూ ట్రక్కు వైపు వచ్చింది. ఏనుగు ఆలోచనను ముందుగా పసిగట్టిన డ్రైవర్ పెద్దగా అరుస్తూ దాన్ని హడలు గొట్టే ప్రయత్నం చేశారు. తన ట్రక్కును కూడా ట్రర్నింగ్ తిప్పాడు. దీంతో, ట్రక్కు, ఏనుగు ఎదురెదురుగా వచ్చేశాయి (Elephant attacks truck in a safari).

Viral: ఈ ఐఐటీ జేఈఈ విద్యార్థి రోజూ చేసేది చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. నెట్టింట గగ్గోలు!


డ్రైవర్ మాత్రం గట్టిగా అరుస్తూ దాన్ని తోలేసే ప్రయత్నం చేశాడు. కానీ ఏనుగు రెండు అడుగులు వెనక్కు వేసినట్టే వేసి ముందుకు వచ్చి ట్రక్కులు దంతాలను పైకెత్తింది. దీంతో వాహనంలోని వారందరూ హాహాకారాలు చేశారు. ట్రక్కును అలాగే పైకెత్తిన ఏనుగు ఆ తరువాత వదిలేయడంతో అది పెద్ద శబ్దంతో కింద పడింది. మళ్లీ రెండోసారి కూడా ఏనుగు ఇలానే చేసింది. ఏనుగు ధాటికి డ్రైవర్ బెంబేలెత్తిపోయాడు. వదిలేయమంటూ దణ్ణం పెట్టాడు. ఇది చూసిన ఏనుగు ఏమనుకుందో కానీ ట్రక్కును వదిలేసి వెనక్కు వెళ్లింది. ఈ ఘటన చూసిన జనాలు షాకైపోతున్నారు. డ్రైవర్ అభ్యర్థన చూసిన ఏనుగు జాలి పడి ప్రాణాలతో విడిచిపెట్టిందంటూ కొందరు కామెంట్ చేశారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Mar 22 , 2024 | 05:09 PM