Share News

Viral Video: ఓరి.. దేవుడో.. ఓ శివ భక్తుణ్ని నంది ఎలా దీవించిందో చూడండి.. వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే..

ABN , Publish Date - Sep 23 , 2024 | 08:04 AM

హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ ప్రకృతిలో చెట్టు, పుట్ట, ఆవు, ఎద్దు.. ఇలా అన్నీ పూజ్యనీయాలే. చెట్లు, జంతువులను కూడా దేవుడికి ప్రతిరూపాలుగా భావించి పూజలు చేస్తారు. ఇక, నందిని ఆ మహా శంకరుడి వాహనంగా భావిస్తారు. నంది లేని శివాలయం ఎక్కడా ఉండదు.

Viral Video: ఓరి.. దేవుడో.. ఓ శివ భక్తుణ్ని నంది ఎలా దీవించిందో చూడండి.. వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే..
Nandi Blessings

హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ ప్రకృతిలో చెట్టు, పుట్ట, ఆవు, ఎద్దు.. ఇలా అన్నీ పూజ్యనీయాలే. చెట్లు, జంతువులను కూడా దేవుడికి (God) ప్రతిరూపాలుగా భావించి పూజలు చేస్తారు. ఇక, నంది (Nandi)ని ఆ మహా శంకరుడి (Lord Shiva) వాహనంగా భావిస్తారు. నంది లేని శివాలయం ఎక్కడా ఉండదు. భక్తులు శివుడితో పాటు నందికి కూడా దండం పెట్టుకుని బయటకు వస్తారు. నందికి అలంకరణలు చేసి పూజలు చేసే సాంప్రదాయం కొన్ని శివాలయాలలలో ఉంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే (Viral Video).


@biharigurl అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. తెల్ల దుస్తులు ధరించిన ఓ యువకుడు శివాలయానికి వెళ్లాడు. అక్కడ ఉన్న నందికి పూజలు చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఆ నంది తీవ్ర ఆగ్రహానికి గురై ఆ భక్తుడిపై దాడికి దిగింది. తన కొమ్ములతో ఎత్తి కుదిపేసింది. పొడిచేందుకు కూడా ప్రయత్నించింది. అయితే ఆ భక్తుడు భయపడి పారిపోలేదు. కింద పడుకుని ఆ నంది కాళ్లు పట్టుకుని వేడుకున్నాడు. ఆశ్చర్యకరంగా ఆ నంది మనసు మార్చుకుంది. తన కాళ్లను అతడిపై వేసి ఆశీర్వదించింది.


ఈ వెరైటీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు ఆరు లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 5.6 వేల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది అద్భుతం``, ``నందికి క్షమాపణలు చెప్పడం ఆ ఆలయం ఆచారం``, ``హర హర మహాదేవ్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: పలుసార్లు దాడి చేసిన కొండచిలువ.. ఎంతో ట్యాలెంట్‌తో తప్పించుకుని ఎలా పట్టుకున్నాడో చూడండి..


Viral Video: ఐకమత్యం లేకపోతే ఇలాగే ఉంటుంది.. కలిసి వేట.. తినే టైమ్‌లో గొడవ.. చివరకు ఏం జరిగిందంటే..


Viral: ఆర్టీసీ బస్సు ఫ్లోర్ డిజైన్‌తో సరికొత్త బ్యాగ్.. ఖరీదెంతో తెలిస్తే మాత్రం కళ్లు తేలెయ్యాల్సిందే..


Viral Video: ఈ పేదవాడి మనసు చాలా పెద్దది.. చెప్పులు కుట్టే ఈ వ్యక్తి కోసం ఎంతో మంది ఎందుకు స్పందించారంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 23 , 2024 | 08:04 AM