Share News

Viral Video: చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి దారి తీయొచ్చు.. గణేశుడిని నిమజ్జనం చేస్తుండగా..

ABN , Publish Date - Sep 15 , 2024 | 08:16 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా గణేశుడి నామస్వరణే వినిపిస్తుంది. ఘనంగా పూజలందుకున్న గణనాథులు.. ఒక్కొక్కటిగా నిమజ్జనానికి తరలిపోవడం చూస్తున్నాం. అయితే గణేశుడి నిమజ్జన సమయంలో కొన్నిసార్లు కొందరి నిర్లక్ష్యం మరికొందరికి..

Viral Video: చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి దారి తీయొచ్చు.. గణేశుడిని నిమజ్జనం చేస్తుండగా..

కొన్నిసార్లు చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు దారి తీయొచ్చు. పెద్దల పర్యవేక్షణ లేక పిల్లలు ప్రమాదంలో పడడం చూస్తుంటాం. అయితే అప్పుడప్పుడూ పెద్దలు పక్కన ఉన్నా కూడా పిల్లలు ప్రమాదానికి గురవుతంటారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. గణేశుడిని నిమజ్జనం చేస్తుండగా.. పెద్దల నిర్లక్ష్యం వల్ల ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా గణేశుడి నామస్వరణే వినిపిస్తుంది. ఘనంగా పూజలందుకున్న గణనాథులు.. ఒక్కొక్కటిగా నిమజ్జనానికి తరలిపోవడం చూస్తున్నాం. అయితే గణేశుడి నిమజ్జన (Ganesh visarjan) సమయంలో కొన్నిసార్లు కొందరి నిర్లక్ష్యం మరికొందరికి ప్రాణసంకటంగా మారడం చూస్తుంటాం. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Viral Video: బాలుడు ఫోన్‌ బిజీలో ఉండగా.. చకచకా భుజంపైకి ఎక్కిన బల్లి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


కొందరు చిన్న గణనాథుడి విగ్రహాన్ని చేతులపై తీసుకెళ్లి కోనేటిలో నిమజ్జనం చేస్తుంటారు. వారి వెంట కొందరు చిన్నపిల్లలు కూడా ఉంటారు. ముందుగా గణేశుడిని ఎత్తుకున్న వ్యక్తి మెట్ల కింద కిందకు దిగి విగ్రహాన్ని నీటిలో ముంచేందుకు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న పిల్లలు ఈ ఘటనను ఆసక్తిగా గమనిస్తుంటారు. తీరా గణేశుడిని నీటిలో ముంచే సమయంలో వెనుక ఉన్న ఓ బాలిక మెల్లగా ముందుకు వస్తుంది. వచ్చీ రావడంతోనే మరో అడుగు ముందుకు వేస్తుంది. దీంతో సడన్‌గా (girl fell into the water) నీటిలో మునిగిపోతుంది. బాలిక నీటిలో పడిపోవడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.

Viral Video: వినూత్నంగా స్విమ్మింగ్ చేయాలనుకుంటే.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


ఫోన్‌తో వీడియో తీస్తున్న వ్యక్తి కూడా ఈ ఘటన చూసి పరుగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. చూస్తుంటే వారంతా కలిసి ఆ బాలికను కాపాడినట్లే కనిపిస్తోంది. అయితే పక్కనే పెద్దవారు ఉండి కూడా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం విచారకరం. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి సమయాల్లో చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి’’.. అంటూ కొందరు, ‘‘ఆ గణేశుడే పాపను కాపాడి ఉంటాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పాములు ఇలాక్కూడా చేస్తాయా.. గొంతులో ఉబ్బెత్తుగా ఉండడంతో.. ఏంటా అని పరిశీలించగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 15 , 2024 | 08:16 PM