NRI: ఏంటీ.. అంత సంపాదిస్తున్నా సరిపోట్లేదా! కెనడా ఎన్నారైపై జనాల విసుర్లు!
ABN , Publish Date - Sep 28 , 2024 | 08:26 PM
కెనడాలో తాను ఏటా రూ.70 లక్షలు సంపాదిస్తున్నా సరిపోవట్లేదంటూ ఓ ఎన్నారై చేసిన కామెంట్ వైరల్‌గా మారింది. కొందరు ఆయన సూచనతో ఏకీభవిస్తుంటే మరికొందరు మాత్రం విభేదిస్తున్నారు. మనుషులకు ఎంత ఉన్నా సరిపోదని కామెంట్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయుల్లో అనేక మందికి విదేశాల్లో స్థిరపడాలనేది చిరకాల కోరిక. అక్కడి లైఫ్ స్టైల్ సౌకర్యాలు ఎంజాయ్ చేస్తూ గడిపేయాలని కోరుకుంటారు. కానీ, ఇప్పటికే విదేశాల్లో సెటిలైన వారిలో కొందరిది మరో వ్యధ. సంపాదించిందంతా నీళ్లలా ఖర్చైపోతోందని కొందరు అంటారు. ఉద్యోగ భద్రత లేదని మరికొందరు చెబుతారు. జీవితం ఉరుకులు పరుగుల మయంగా మారిందని మరికొందరు అంటారు. ఇలా ఎవరి కష్టసుఖాలు వారు చెప్పుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో కెనడాలో ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్ ఎన్నారై తాజాగా నెట్టింట పంచుకున్న ఉదంతం వైరల్ (Viral) అవుతోంది.
Viral: లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలో ఈమెను చూసి నేర్చుకోవాలి! వీడియో వైరల్!
పీయూష్ మోంగా అనే కంటెంట్ క్రియేటర్ ఈ వీడియోను షేర్ చేశారు. వీడియోలో ఓ టెకీ కెనడాలో పరిస్థితుల గురించి చెప్పారు. టొరొంటోలో తన శాలరీ లక్ష పైచిలుకు డాలర్ల మేర ఉందని చెప్పారు. కానీ, ఆ నగరంలో ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని అన్నారు. ఇంటి అద్దెకే నెలకు మూడు వేల డాలర్లు పోతోందని వాపోయారు. లక్ష డాలర్లు సంపాదిస్తున్నా ఈ రోజుల్లు అస్సలు చాలట్లేదని వాపోయారు. డౌట్ టౌన్‌లో ఈ పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. శాప్ స్పెషలిస్టుగా చేస్తున్న ఈ బ్రదర్‌కు లక్ష డాలర్ల సంపాదన సరిపోవట్లేదు అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పీయూష్ షేర్ చేశారు.
Viral: ఆఫీసులో అలసిపోయి వచ్చిన భార్య కోసం వంట వండని భర్త! చివరకు..
ఇక ఈ వీడియోకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది ఎన్నారై టెకీ కామెంట్స్‌పై తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. తానూ ఇన్ఫోసిస్ లైఫ్ సైన్సెస్ విభాగంలో శాప్ స్పెషలిస్టుగా పనిచేశానని ఓ వ్యక్తి చెప్పారు. ఈ పనిమీదే అమెరికా వెళ్లిన అనేక మంది తిరిగొచ్చేశారని వివరించారు. ఫలితంగా తాను విదేశాలకు వెళ్లాలనుకున్న ఆలోచన మానుకున్నానని చెప్పారు.
Viral: వామ్మో! పెళ్లికొచ్చిన అతిథుల నుంచి వధూవరులు రూ.2 లక్షలు చొప్పున వసూల్!
మరికొందరేమో సదరు టెకీని కంపెనీ మారాలని చెప్పారు. కంపెనీ అంతర్గత బదిలీలతో శాలరీలు పెరగవని తేల్చి చెప్పారు. కొందరు మాత్రం ఎన్నారై అభిప్రాయంతో విభేదించారు. ‘‘మనుషులకు ఎంత సంపాదన ఉన్నా చాలదు. బ్రో.. కెనడాలో లైఫ్ ఎంజాయ్ చేయండి. భారత్‌లో లైఫ్ కంటె అక్కడి లైఫ్ ఇరవై రెట్లు బెటర్’’ అని మరో వ్యక్తి కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది. కాగా, సాఫ్ట్‌వేర్ సర్టిఫికేషన్ కోర్సులతో మంచి జీతాలు సంపాదించొచ్చని ఇటీవల కెనడాలో మరో ఎన్నారై జంట చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వారు మంచి సూచన చేశారని అనేక మంది అభిప్రాయపడ్డారు.
Civil Aviation: విమానాలు గరిష్ఠంగా ఎంత ఎత్తులో ప్రయాణించగలవో తెలుసా?