Share News

Viral: పాపం.. మరీ ఇలా ట్రోల్ చేయాలా? ఫారిన్‌లో ఉంటున్న భారతీయ విద్యార్థికి షాకింగ్ అనుభవం!

ABN , Publish Date - Mar 21 , 2024 | 07:50 PM

విదేశాల్లో ఉంటూ చదువుకుంటున్న ఓ భారతీయ విద్యార్థి చేసిన ఒకేఒక్క ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: పాపం.. మరీ ఇలా ట్రోల్ చేయాలా? ఫారిన్‌లో ఉంటున్న భారతీయ విద్యార్థికి షాకింగ్ అనుభవం!

ఇంటర్నెట్ డెస్క్: అద్భుత భవిష్యత్తు కోసం అనేక మంది విదేశీ చదువులవైపు మొగ్గు చూపుతుంటారు. అలానే ఓ భారతీయ విద్యా్ర్థి ఫారిన్ వెళ్లాడు. అక్కడ తన అనుభవాల గురించి చెబుతూ అతడు పెట్టిన పోస్ట్ (Indian Students's viral Post) నెట్టింట వివాదానికి దారి తీసింది. తెలిసీతెలియని అతడి కామెంట్ చూసిన జనాలు ఆ విద్యార్థిపై మండిపడుతున్నారు. దీంతో, దిమ్మెరపోవడం ఆయన వంతైంది. అతడి పరిస్థితి చూసి కొందరు అయ్యో పాపం అంటూ నిట్టూర్చారు.

Viral: ఈ ఐఐటీ జేఈఈ విద్యార్థి రోజూ చేసేది చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. నెట్టింట గగ్గోలు!


విదేశీ లైఫ్ గురించి ఇప్పటికీ జనాలకు అనేక అపోహలు, అవాస్తవ అంచనాలు ఉన్నాయి. అక్కడికెళ్లాక ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ, అంతటి సీన్ ఉండదని అక్కడికెళ్లిన అనేక మంది చెబుతుంటారు. అయితే, ఓ విద్యార్థి కూడా బహుశా ఇలాంటి అవాస్తవ అంచనాలతోనే విదేశాలకు వెళ్లాడు. అక్కడ తన పనులన్నీ తనే చేసుకోవాల్సి రావడంతో ఒకింత తికమక పడి తెలిసీ తెలియని ట్వీట్ చేశారు. విదేశాలకు వెళితే ఫుల్ ఎంజాయ్ అన్నారు.. ఏంటో అనుకున్నా కానీ ఇలా అస్సలు ఊహించలేదంటూ (Daily chores) అతడు తాను అంట్లు తోముతున్న ఫోటో షేర్ చేశాడు. అంతే..ఈ ఒక్క ట్వీట్‌తో జనాలు అతడిని చెడుగుడు ఆడుకోవడం మొదలెట్టారు.

Exercise Pill: ఈ టాబ్లెట్ వేసుకుంటే జిమ్‌కు వెళ్లక్కర్లేదు! కాలు కదపకుండానే కసరత్తుల బెనిఫిట్స్!


ఇండియాలో ఉన్నంతకాలం ఇంట్లో ఏ పనీ చేసుండడు.. అందుకే ఫారిన్ వెళ్లాక ఇలా ఫీలవుతున్నాడని కొందరు కామెంట్ చేశారు. తన పని తను చేసుకునే అలవాటు కూడా లేనట్టుందని కొందరు విమర్శించారు. ఒంటరిగా జీవించడం వల్ల ఎన్నో నేర్చుకోవచ్చని, స్వావలంబన సాధించొచ్చని కొందరు చెప్పుకొచ్చారు. ఏదో తెలీక అన్నాడనుకుని వదిలేయక మరీ ఇంతలా ట్రోల్ చేయాలా అంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2024 | 07:58 PM