Share News

Juvenile Robbers: 11 ఏళ్ల వయసులోనే బ్యాంకు దోపిడీ.. సెలవుల్లో స్కూలు పిల్లల దారుణం! ఎలా చేశారంటే..

ABN , Publish Date - Mar 25 , 2024 | 05:01 PM

హైస్కూల్ పిల్లలు బ్యాంకు దోపిడీకి పాల్పడిన ఘటన అమెరికాలోని హ్యూస్టన్‌లో తాజాగా వెలుగు చూసింది.

Juvenile Robbers: 11 ఏళ్ల వయసులోనే బ్యాంకు దోపిడీ.. సెలవుల్లో స్కూలు పిల్లల దారుణం! ఎలా చేశారంటే..

ఇంటర్నెట్ డెస్క్: హైస్కూల్ పిల్లలు సెలవులు వస్తే ఏం చేస్తారు? అంటే వీడియో గేములో, ఇతర ఆటలో ఆడుకుంటూ ఉంటారని చెబుతాం. కానీ అమెరికాలోని ముగ్గురు టీనేజర్లు మాత్రం బ్యాంకు దోపిడీ చేశారు. నమ్మశక్యం కానీ ఈ ఉదంతం హ్యూస్టన్‌లో ఇటీవలే వెలుగు చూసింది (US juveniles Rob bank in Houston). టీవీల్లో ప్రసారమవుతున్న సీసీటీవీ ఫుటేజీని చూసిన చిన్నారుల తల్లిదండ్రులే వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులే ఆశ్చర్యపోయేలా చేసిన ఈ ఉదంతం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం (Viral) కలిగిస్తోంది. మన సమాజం ఎటుపోతోందో అని అనేక మంది ఆవేదన చెందేలా చేస్తోంది.

Viral: ఇది నిజమా..? చిన్న కిటుకుతో బండి మైలేజీ ఏకంగా 90 కేఎమ్‌పీఎల్!


స్థానిక మీడియా వీళ్లను లిటిల్ రాస్కెల్స్ అని పిలుస్తోంది. వీరిలో అందరికంటే చిన్నవాడి వయసు 11 ఏళ్లు కాగా, మరో ఇద్దరు బాలుర వయసు 12, 16 ఏళ్లు. ఇటీవల వాళ్లు ముగ్గురు ఉత్తరహ్యూస్టన్‌లోని గ్రీన్స్‌పాయింట్ ప్రాంతంలోగల వెల్స్ ఫార్గో (Wells Fargo Bank) బ్యాంకుకు వెళ్లారు. జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిన వాళ్లు అక్కడున్న క్లర్క్‌కు చిట్టి ఇచ్చారు. అక్కడున్న మొత్తం ఇచ్చేయాలంటూ చిట్టీలో రాశారు. ఇది చదివిన క్లర్స్ భయపడిపోయారు. వారి దగ్గర తుపాకులు ఉండచ్చేమోనని భయపడి వారు అడిగినది ఇవ్వడంతో టీనేజర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Viral: మీ ఇంట్లో వేరే వాళ్లు ఉంటున్నారంటూ పక్కింటి వ్యక్తి నుంచి ఫోన్.. వెళ్లి చూస్తే..


ఆ తరువాత పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుల సమాచారం సేకరించారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నేరం జరిగిన తీరు పరిశీలించి ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న వయసులో వాళ్లకు దోపిడీ చేయాలనే ఆలోచన, ధైర్యం ఎలా వచ్చాయో పోలీసులకు ఓ పట్టాన అర్థం కాలేదు. మరోవైపు, ఈ ఫుటేజీని మీడియా ద్వారా పబ్లిక్‌లో రిలీజ్ చేసి నిందితుల ఆచూకీ చెప్పాలని ప్రజలను అభ్యర్థించారు. దీంతో, ఆ దోపిడీ వెనక ఉన్నది తమ బిడ్డలే అని గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో నేరం రుజువైతే నిందితులు 19 ఏళ్ల వరకూ బాలల సంరక్షణాలయంలోనే ఉండాల్సి వస్తుంది.


ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. నేరం జరుగుతున్న సమయంలో పోలీసుల అక్కడ ఉండి ఉంటే పరిస్థితి దారుణమైన మలుపు తిరిగి ఉండేదని వ్యాఖ్యానించారు. తమ ప్రాణాలకు ప్రమాదమని తెలిస్తే పోలీసులు ఎంతటి కఠిన నిర్ణయం తీసుకునేందుకైనా వెనకాడరని అన్నారు. అయితే, చిన్నారుల వెనక పెద్ద నేరస్తులు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 25 , 2024 | 05:10 PM