Viral: ఇది నిజంగా పిచ్చే, మనుషులు ఇలా ఎందుకుంటారో? 2 ఏళ్ల నాటి వీడియో చూసి ఐఎఫ్ఎస్ అధికారి గుస్సా
ABN , Publish Date - Feb 24 , 2024 | 04:53 PM
అడవి ఏనుగును కర్రతో కొట్టపోయిన ఓ వ్యక్తి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అతడి మూర్ఖపు చర్య చూసి ఐఎఫ్ఎస్ అధికారి కూడా ఆశ్చర్యపోయారు.
ఇంటర్నెట్ డెస్క్: అడవి జంతువులతో ఆటలు ప్రాణాలతో చెలగాలమే. ఇప్పటికే ఎందరో ఇలాంటి చేష్టలతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయినా కూడా జనాల్లో ఆశించినంత మార్పు రావట్లేదు. అందుకే అధికారులు తమ వంతు బాధ్యతగా నిత్యం ప్రజలను అప్రమత్తం చేస్తుంటున్నారు. తాజాగా ఐఎఫ్ఎస్ అధికారి సురేంద్ర మెహ్రా కూడా ఓ షాకింగ్ వీడియోను (ViralVideo) షేర్ చేశారు. వీడియోలోని వ్యక్తి చేసిన పనికి జనాలు షాకైపోతున్నారు.
Viral: సంబరం పట్టలేకపోయిన ఏనుగు.. అది చేసిన పనికి అధికారులకే ఆశ్చర్యం.. ఈ వీడియో చూస్తే..
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ ఏనుగుల గుంపు జనావాసాల దగ్గరకు వచ్చింది. దాన్ని తోలే క్రమంలో గ్రామస్తులు స్వయంగా రంగంలోకి దిగారు. ఓ వ్యక్తి పెద్ద కర్ర పుచ్చుకుని దాన్ని కొట్టే ప్రయత్నం చేశాడు. అది అడవి ఏనుగు కావడంతో వెంటనే ప్రతి దాడికి ప్రయత్నించింది. అది అతడి వెంట పరిగెత్తడంతో గ్రామస్తుడు కూడా పరుగు లంఘించుకున్నాడు (Man pokes wild elephant). ఇది రెండేళ్ల నాటి వీడియో. అప్పట్లో ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి పలు హెచ్చరికలు చేశాడు. అడవి జంతువులు, మనషుల ఒకరిపై మరొకరు భయం కోల్పోతే చివరకు దారుణ ప్రమాదాలు వస్తాయి’’ అంటూ అతడు హెచ్చరించాడు (Man Animal Conflict).
Viral: ముక్కులోంచి ఆగకుండా కారుతున్న రక్తం.. పేషెంట్‌ను చూసిన డాక్టర్లకే షాక్! చివరకు..
ఈ వీడియోను షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి సురేంద్ర మెహ్రా కూడా షాకైపోయారు. ఇది పిచ్చితనం, జనాలు ఇలా ఎందుకు ఆలోచిస్తారో? ఇలా జంతువులను రెచ్చగొడితే దారుణాలు జరుగుతాయి’ అంటూ ఘటన తీవ్రతను కళ్లకుకట్టినట్టు వర్ణించారు.
వీడియో చూసిన జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి పిచ్చి పనులు చేసి యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు అన్నారు. అడవి జంతువులు కనిపిస్తే ముందుగా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని మరికొందరు సూచించారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి