Share News

Marriage Life: వైవాహిక జీవితం సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? సుధామూర్తి చెప్పిన చిట్కాలివే..!

ABN , Publish Date - Apr 15 , 2024 | 02:19 PM

వివాహ బంధం సక్సెస్ కావడానికి ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకురాలు.. సుధా మూర్తి గారు చెప్పిన టిప్స్ ఇవీ..

Marriage Life: వైవాహిక జీవితం సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? సుధామూర్తి చెప్పిన చిట్కాలివే..!

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహ బంధం చాలా ప్రత్యేకమైనది. మూడు ముళ్లు, ఏడు అడుగులతో ఒక్కటై జీవితాంతం కలిసి ఉండటం, జీవితంలో ఎెదురయ్యే ఎన్నో సమస్యలను జంటగా ఎదుర్కోవడం వైవాహిక బంధంలో ఉండే విశిష్టత. కొత్త వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానించాలన్నా, ఆ వ్యక్తితో జీవితం సంతోషంగా ఉండాలన్నా కొన్ని విషయాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వివాహ బంధం సక్సెస్ కావడానికి ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకురాలు.. సుధా మూర్తి గారు చెప్పిన టిప్స్ ఏంటో తెలుసుకుంటే..

అవగాహన, అంగీకారం..

వివాహ బంధం విజయవంతం కావాలంటే దానికి మొదట అంగీకారం ముఖ్యపాత్ర పోషిస్తుంది. భాగస్వామి ఇలాగే ఉండాలి లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏవీ పెట్టుకోకండా వ్యక్తిని అంగీకరించడం ఎంతో ముఖ్యం. ఇది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరినొకరు గౌరవించుకోవడానికి ఎంతో గొప్పగా సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: రాగులను రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే జరిగేదిదే..!


స్వేచ్చ..

బంధం విజయవంతం కావలాంటే భాగస్వాములకు స్వేచ్చ అవసరం. ఎవరి అభిరుచులు, ఆసక్తులు, ప్రాధాన్యతలు వారికి ఉంటాయి. వాటి విషయంలో స్వేచ్చగా ఉండాలి. ఇది ఒకరి మీద ఒకరికి గౌరవాన్ని పెంచుతుంది. బంధాన్ని బలపరుస్తుంది.

గౌరవం..

వివాహం జరిగే వరకు ఇద్దరు వ్యక్తులు వేర్వేరు కుటుంబాలకు చెందినవారు అయి ఉంటారు. దీనివల్ల పెరిగిన వాతావరణం నుండి ఆహారపు అలవాట్లు, జీవిత అనుభవాలు, జీవనశైలి అన్నీ విభిన్నంగా ఉండొచ్చు. కాబట్టి ఈ విషయాలలో ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఒకరి అలవాట్లను, పద్దతులను మరొకరు గౌరవించుకుంటే వారి మధ్య బంధం మరింత బలపడుతుంది.

ఆర్థిక అవగాహన..

పెళ్లి చేసుకోబోయే జంట ఎల్లప్పుడూ ఆర్థిక విషయాల మీద అవగాహన కలిగి ఉండాలి. బడ్జెట్, పొదుపు, పెట్టుబడులు, ఖర్చులు మొదలైన విషయాల గురించి అవగాహన ఉంటేనే ఇద్దరి మధ్య ప్రేమ బంధాన్ని ఆర్థిక బంధాలు ఇబ్బంది పెట్టవు. ఆర్థిక సమస్యలు చాలా వరకు వైవాహిక జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఆర్థికంగా బలంగా ఉండాలి.

సపోర్ట్, సానుభూతి..

వివాహం తరువాత జీవితాల్లో ఎదురయ్యే క్లిష్ట సమయాలలో భాగస్వామి మద్దతు, వారు చూపించే ప్రేమ, జాలి వంటివి అవసరం. ఇవి ఉంటే సమస్యలను సులువుగా దాటేస్తారు. ఒకరికొకరు సపోర్ట్ గా ఉన్నామనే ధీమా కూడా కలుగుతుంది.

కమ్యూనికేషన్..

భార్యాభర్తల మద్య కమ్యూనికేషన్ ఎంత ఆరోగ్యకరంగా ఉంటే వారి బంధం కూడా అంత బాగుంటుంది. ఇద్దరి మధ్య నిజాయితీ ఉండాలి. అదే బంధంలో నమ్మకాన్ని పెంచుతుంది. భావోద్వేగాలను వ్యక్తం చేసేటప్పుడు, కోపం, అసహనం వంటి పరిస్థితులలో ఉన్నప్పుడు భాగస్వామిని నొప్పించకుండా వారితో వ్యవహరించడం పెద్ద టాస్క్.

కుటుంబ ప్రాధాన్యత..

వ్యక్తిగత జీవితంలో లక్ష్యాలు, సవాళ్లు ఎన్ని ఉన్నా అవన్నీ కుటుంబంతో గడపడానికి ఆటంకం కాకూడదు. భాగస్వామితో తగిన సమయాన్ని గడపాలి. కుటుంబంతో తగినంత సమయం గడిపితేనే వ్యక్తుల మధ్య, భాగస్వాముల మధ్య బంధం దృఢంగా ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 15 , 2024 | 02:19 PM