Share News

Viral Video: పెద్దాయనా.. ఏంటీ పని.. స్వీట్ షాపు ఎదుట ఈ వృద్ధుడు ఏం చేస్తున్నాడో చూడండి..

ABN , Publish Date - Jul 09 , 2024 | 07:40 PM

చాలా మంది వ్యాపారస్తులు తమ ఉత్పత్తలను వివిధ రకాలుగా కల్తీ చేయడం చూశాం. అలాగే మరికొందరు వ్యాపారులు.. ఆహార పదార్థాల తయారీలో శుభ్రత పాటించకపోవడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ...

Viral Video: పెద్దాయనా.. ఏంటీ పని..  స్వీట్ షాపు ఎదుట ఈ వృద్ధుడు ఏం చేస్తున్నాడో చూడండి..

చాలా మంది వ్యాపారస్తులు తమ ఉత్పత్తలను వివిధ రకాలుగా కల్తీ చేయడం చూశాం. అలాగే మరికొందరు వ్యాపారులు.. ఆహార పదార్థాల తయారీలో శుభ్రత పాటించకపోవడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషలో మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, స్వీట్ షాపులో ఓ వృద్ధుడు చేసిన పని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘పెద్దాయనా.. ఏంటీ పని’’... అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. స్వీటు షాపు (Sweet shop) నిర్వహిస్తున్న ఓ వృద్ధుడు.. అంతా షాక్ అయ్యేలా ప్రవర్తించాడు. షాపులో వివిధ రకాల స్వీట్లతో పాటూ కారాలు (karas) కూడా విక్రయిస్తున్నాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. దుకాణం ముందు ప్రదర్శనగా ఉంచిన కారాల్లో కొన్ని నేలపై పడిపోయాయి. దీన్ని గమనించిన వృద్ధుడు (old man).. వాటిని తీసేసి చెత్తబుట్టలో పడేయకుండా అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు.

Viral Video: కారులో ‘‘ఒకే ఒక్కడు’’ సాంగ్ వినగానే.. బైకులో బాలిక రియాక్షన్ చూసి అంతా షాక్..


చీపురుతో కింద పడ్డ కారాలన్నింటినీ ఎత్తి మళ్లీ పైన ఉన్న ప్లేటులోని కారాల్లో కలిపేశాడు. ఇలా దుమ్ము, ధూళితూ కూడిన కారాలన్నింటినీ తిరిగి ప్లేటులో కలిపేశాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు షాక్ అయ్యారు. కొందరు ఈ పెద్దాయన నిర్వాకాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇన్నాళ్లూ కల్తీనే అనుకున్నాం.. ఇలాంటి పనులు కూడా చేస్తున్నారా’’.. అంటూ కొందరు, ‘‘ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: తెలివితక్కువ పులిని ఎప్పుడైనా చూశారా.. నీటిలో పాము అనుకుని చివరకు అది చేసిన నిర్వాకం..

Updated Date - Jul 09 , 2024 | 07:40 PM