Viral: రాజస్థాన్‌లో నిల్చుని మధ్యప్రదేశ్‌లో టిక్కెట్ తీసుకోవాలి.. ఆ రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుని అమితాబ్ కూడా షాక్..
ABN , Publish Date - Oct 21 , 2024 | 02:31 PM
మనదేశంలో ఎన్నో కోట్ల మంది రోజు రైలు ప్రయాణాలు చేస్తుంటారు. ఒక నగరం నుంచి మరో నగరాకి వెళ్లడానికి రైళ్లు ఎక్కుతుంటారు. అయితే మన దేశంలో ఒక వెరైటీ రైల్వే స్టేషన్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ స్టేషన్‌కు వెళితే చాలు.. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నడిచి వెళ్లిపోవచ్చు.
భారతీయులు బస్సు, విమానం కంటే రైలు ప్రయాణం (Train Journey) చేయడానికే ఎక్కువగా ఇష్టపడతారు. సౌకర్యవంతంగా, చవకగా ఉండే రైలు ప్రయాణం వైపే చాలా మంది మొగ్గు చూపుతారు. మనదేశంలో ఎన్నో కోట్ల మంది రోజూ రైలు ప్రయాణాలు చేస్తుంటారు. ఒక నగరం నుంచి మరో నగరాకి వెళ్లడానికి రైళ్లు (Train) ఎక్కుతుంటారు. అయితే మన దేశంలో ఒక వెరైటీ రైల్వే స్టేషన్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ స్టేషన్‌కు వెళితే చాలు.. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నడిచి వెళ్లిపోవచ్చు. ఆ వెరైటీ రైల్వే స్టేషన్ గురించి తెలిసి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan ) కూడా ఆశ్చర్యపోయారు.
కౌన్ బనేగా కరోడ్‌పతి
` గేమ్ షోల్ భాగంగా ఆ రైల్వే స్టేషన్ గురించిన ప్రశ్న వచ్చింది. రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో ఉన్న భవానీ మండి రైల్వే స్టేషన్ (Bhawani Mandi railway station) రెండు రాష్ట్రాల మధ్య విభజనకు గురైంది. ఈ స్టేషన్ రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉంది. దీంతో ఆ స్టేషన్‌లో సగ భాగం రాజస్థాన్‌లో, సగ భాగం మధ్యప్రదేశ్‌లో ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్‌లో, టికెట్ ఇచ్చే వ్యక్తి మధ్యప్రదేశ్‌లో కూర్చొని ఉండగా, టికెట్ తీసుకునే ప్రయాణికుడు రాజస్థాన్‌లో నిలబడి ఉంటాడు. ఈ రైల్వే స్టేషన్‌కి ఒకవైపు రాజస్థాన్ అని రాసి ఉండగా, మరోవైపు మధ్యప్రదేశ్ అని రాసి ఉంటుంది (Unique railway stations).
ఆ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఏదైనా ప్రమాదం జరిగితే సంఘటన స్థలాన్ని బట్టి సదరు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగుతుంది. భవానీ మండికి సంబంధించిన ప్రశ్న తాజాగా కేబీసీ ఎపిసోడ్‌లో వచ్చింది. ఆ రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుని అమితాబ్ బచ్చన్ కూడా ఆశ్చర్యపోయారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను ఇప్పటివరకు 22 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోను 1.4 లక్షల మందికి పైగా లైక్ చేశారు.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..