Share News

Viral Video: షాప్‌లో చిక్కుకున్న కుక్క పిల్ల.. తల్లి కుక్క ఎంత విలవిలలాడిందో చూడండి.. ఎమోషనల్ వీడియో వైరల్!

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:12 PM

ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు సాటి వచ్చేది మరేదీ లేదు. మనుషులే కాదు.. జంతువులు కూడా తమ పిల్లల పట్ల ఎంతో ప్రేమను, ఆప్యాయతను కనబరుస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే కన్నీళ్లు రాక మానవు. తప్పి పోయిన కుక్క పిల్ల గురించి తల్లి పడిన వేదన అంతా ఇంతా కాదు.

Viral Video: షాప్‌లో చిక్కుకున్న కుక్క పిల్ల.. తల్లి కుక్క ఎంత విలవిలలాడిందో చూడండి.. ఎమోషనల్ వీడియో వైరల్!

ఈ ప్రపంచంలో తల్లి (Mother) ప్రేమకు సాటి వచ్చేది మరేదీ లేదు. మనుషులే కాదు.. జంతువులు కూడా తమ పిల్లల పట్ల ఎంతో ప్రేమను, ఆప్యాయతను కనబరుస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే కన్నీళ్లు రాక మానవు. తప్పి పోయిన కుక్క పిల్ల (Puppy) గురించి తల్లి పడిన వేదన అంతా ఇంతా కాదు. ఓ వ్యక్తి ఆ కుక్క (Dog) బాధను అర్థం చేసుకుని కుక్క పిల్లను తీసుకొచ్చాడు. ఆ ఎమోషనల్ వీడియో (Emotional Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది (Viral Video).


కపిలా అభిషేక్ తివారీ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కుక్కపిల్ల ప్రమాదవశాత్తూ దుకాణంలోకి వెళ్లిపోయింది. యజమానిని దానిని చూసుకోకుండా షట్టర్ వేసేశాడు. దీంతో ఆ కుక్క పిల్ల కోసం తల్లి ఎంతగానో వెతికింది. చివరకు అది షాప్‌లో ఉన్నట్టు తెలుసుకుంది. లోపలికి వెళ్లడం కోసం షట్టర్ కింద గొయ్యి తవ్వడానికి ప్రయత్నించింది. ఆ కుక్క వేదనను అర్థం చేసుకున్న వ్యక్తి ఆ షాప్ యజమానికి ఫోన్ చేశారు.


షాప్ ఓపెన్ చేయించి ఆ కుక్క పిల్లలను బయటకు తీసుకొచ్చి తల్లి దగ్గరకు చేర్చారు. దీంతో ఆ రెండూ ఎంతో సంతోషంగా కనిపించాయి. ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. దాదాపు 15 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఇది చాలా ఎమోషనల్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీ కళ్లకు అసలైన పరీక్ష బాస్.. ఈ ఫొటోలోని మూడు ముఖ్యమైన తేడాలను కనిపెట్టండి!

Viral Video: వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే.. గాల్లో ఎగురుతూ ఢీకొన్న రెండు హెలికాఫ్టర్లు.. 10 మంది మృతి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 24 , 2024 | 12:12 PM