Viral: మీ భర్త గే అంటూ మెసేజ్.. ఆ మహిళ దిమ్మతిరిగే రిప్లై ఇవ్వడంతో షాక్.. అసలు కథేంటంటే..
ABN , Publish Date - Apr 13 , 2024 | 04:37 PM
ప్రస్తుతం ప్రపంచం అంతా డిజిటల్ మయం అయిపోయింది. దీంతో సైబర్ మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్కోసారి వింత వింత మెసేజ్‌లు, కాల్స్, మెయిల్స్ వచ్చి చాలా మందిని గందరగోళానికి గురి చేస్తున్నాయి. అమాయకులైతే మోసపోయి భారీగా డబ్బులు కోల్పోతున్నారు.
ప్రస్తుతం ప్రపంచం అంతా డిజిటల్ (Digital) మయం అయిపోయింది. దీంతో సైబర్ మోసాలు (Cyber Crime) కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్కోసారి వింత వింత మెసేజ్‌లు, కాల్స్, మెయిల్స్ వచ్చి చాలా మందిని గందరగోళానికి గురి చేస్తున్నాయి. అమాయకులైతే మోసపోయి భారీగా డబ్బులు కోల్పోతున్నారు. తెలివైన వాళ్లు సమర్థంగా ఆ మోసాలను తిప్పి కొడుతున్నారు. తాజాగా ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆమె ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది (Viral News).
జార్జర్ వెల్ హబీబీ అనే మహిళకు ఓ వ్యక్తికి ఓ అపరిచిత వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. ``ఆ వ్యక్తికి నా నెంబర్ ఎలా దొరికిందో తెలియదు. అతడు నా పేరు చివర ఉన్న హబీబీని తప్పుగా అర్థం చేసుకున్నాడు. హబీబీ అంటే నా భర్త అనుకున్నాడు. ``నీ భర్త గే. అతడితో నాకు అఫైర్ ఉంది`` అంటూ మెసేజ్ పంపించాడు. నిజానికి హబీబీ నా తండ్రి పేరు. అతడు 70 ఏళ్ల వ్యక్తి. మిలిటరీ సైనికుడిగా పని చేశారు. ఆ మెసేజ్ ఉద్దేశ్యమేంటో నాకు అర్థమైంది. మమ్మల్ని బెదిరించి డబ్బులు లాగాలనుకున్నాడ`ని జార్జర్ పేర్కొన్నారు.
ఆ స్కామర్‌తో జార్జర్ ఓ జోక్ చేసింది. ``తనకు హెచ్‌ఐవీ ఉందని తెలిసిన దగ్గర్నుంచి నా భార్త పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. కనీసం మీరైనా అతడికి మద్ధతుగా ఉన్నందుకు ధన్యవాదాలు`` అంటూ రిప్లై పంపింది. దీంతో ఆ స్కామర్ నుంచి స్పందన రాలేదు. ఆ సంభాషణను జార్జర్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌ను 2.3 లక్షల మందికి పైగా వీక్షించారు. జార్జర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
ఇవి కూడా చదవండి..
Puzzle: మీ బ్రెయిన్ ఎంత షార్ప్‌గా ఉందో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోల్లోని తప్పులను కనిపెట్టండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..